తెలంగాణకే తలమానికం. ఎన్డీఎస్ఎల్.

Telangana

తెలంగాణకే తలమానికం. ఎన్డీఎస్ఎల్

మెట్ పల్లి మార్చి 11 నేటి ధాత్రి

చక్కర కర్మగారాన్ని నాశనం చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం పసుపునకు రూ. 12వేల మద్దతు ధర ఇవ్వాల్సిందే చెరుకు రైతుల కోసం ఉద్యమించేది బీజేపీ పార్టీ మాత్రమే బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని మెట్ పల్లిలో చెరుకు రైతులకు మద్దతుగా బీజేపీ మహాధర్నా
మెట్ పల్లితెలంగాణకే తలమానికం ఎన్డీఎస్ఎల్ కర్మగారాలు అని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని అన్నారు. మంగళవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన పిలుపు మేరకు మెట్ పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు, రైతు సంఘ ప్రతినిధులతో కలిసి మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంటపాటు రహదారిపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు హాజరై మాట్లాడారు.
1947లోనే బోధన్ లో ఎన్డీఎస్ఎల్ కర్మాగారం ప్రారంభమైందన్నారు. కొన్ని సంవత్సరాలు చెరుకు రైతులకు లాభదాయకంగా ఉన్న ఎన్డీఎస్ఎల్ ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2015లో లే ఆఫ్ ప్రకటించి మూసివేసారన్నారు. దీంతో సుమారు 15 వేల ఎకరాల్లో పంటను చెరుకు రైతులు నష్టపోతున్నారన్నారు. కర్మగారాలను అర్థంతరంగా మూసివేయడంతో చెరుకు రైతులకు ఉపాధి లేక వారితో పాటు, వారి పిల్లల సైతం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
కాగా 2013లోనే బీజేపీ ఆధ్వర్యంలో ముత్యంపేట చక్కర కర్మగారాన్ని తెరిపించాలని డిమాండ్ చేస్తూ మెట్ పల్లిలో రైతులతో కలిసి పార్టీలకతీతంగా ధర్నా కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కర్మాగారం మూతపడడంతో చెరుకు రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి రెండు నవోదయ పాఠశాలలను మంజూరు చేయించిన ఘనత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దక్కుతుందన్నారు. ఒకటి కోరుట్ల నియోజకవర్గంలో, మరొకటి జక్రాన్ పల్లిలో మంజూరు చేయించామని. ఇప్పటికైనా పాలకులు స్పందించి చెరుకు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే చక్కర కర్మగారాన్ని తెరిపించాలని, కర్మాకారానికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా ఆది నుంచి రైతుల సంక్షేమానికి బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన కృషి మేరకు పసుపు బోర్డును సాధించుకున్నామని, పసుపు రైతుల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, ధర్నా కార్యక్రమ కన్వీనర్, రాష్ట్ర నాయకులు ఏలేటి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా – సుఖేందర్ గౌడ్, నరేష్, రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, బీజేపీ నాయకులు, రైతు సంఘం నాయకులు బద్దం శ్రీనివాస్ రెడ్డి, గుంటుక సదాశివ్, వడ్డేపల్లి శ్రీనివాస్, పంచిరి విజయ్, రాజ్ పాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బింగి వెంకటేష్, దొనికెల నవీన్, డాక్టర్ వెంకట్ రెడ్డి, పీసు రాజేందర్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, బొడ్ల నరేష్, గుగ్గిళ్ళ తుకారం గౌడ్, బొడ్ల ఆనంద్, పన్నాల రాఘవరెడ్డి, బొడ్ల గౌతమ్, జక్కుల జగదీష్, సదాశివ్, మహేష్, బొమ్మెల శంకర్, జుంగల ఆనంద్, రమేష్ యాదవ్, శ్రీనివాస్, సుంచు రణధీర్, రాజారెడ్డి, కొయ్యల లక్ష్మణ్, శ్రీధర్ రెడ్డి, చెట్లపల్లి సాగర్, కలాల సాయిచందు, ఇట్యాల నవీన్, కుడుకల రఘు, కలిగోట శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!