రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడేది రాజ్యాంగమేనని, రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రతీ ఒక్కరు పాలకులు, అధికారులు, పౌరులు దేశభక్తి కలిగిన వారేనని క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు అన్నారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ….. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని, రాజ్యాంగ విలువలను, ప్రతిష్టతను ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ, కో ఆప్షన్ సభ్యులు యాకూబ్ అలీ, కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, జిలకర మహేష్, నాయకులు ఎల్లబెల్లి మూర్తి,మేనేజర్ స్వామి రెవిన్యూ అధికారి సతీష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.