కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
రాయికల్, ఆగస్టు 15, నేటి ధాత్రి:
రాయికల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిన్నారులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో వచ్చారు. మరియు విద్యార్థులందరూ పాఠశాల ఆవరణలో సంపద చేసి తదనంతరం పాఠశాల డైరెక్టర్ జే తిరుపతి రావు సరస్వతి మాతకు జ్యోతి వెలిగించి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అనంతరం జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థులకు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది అనంతరం మిఠాయి పంపిణీ చేసి రోడ్డుపై ర్యాలీ చేస్తూ పలుకూడాలలో కొద్ది రోజుల కింద కాశ్మీర్ పహల్గాంలో జరిగిన తీరును కళ్ళకు కట్టినట్టుగా నృత్య రూపంలో ప్రదర్శించారు. మరియు శంభాజీ యొక్క పాటకు నృత్యం చేసి చూపర్లను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జే తిరుపతి రావు , ప్రిన్సిపల్ జె వేణుగోపాలరావు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పోషకులు పాల్గొన్నారు.