అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
◆:- – ఎస్సై దోమ సుజిత్
జహీరాబాద్ నేటి ధాత్రి
జహీరాబాద్ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు హద్నూర్ ఎస్సై దోమ. సుజిత్ ప్రకటనలో తెలిపారు. పెట్రోలింగ్ లో భాగంగా పోలీస్ సిబ్బందితో కలిసి గురువారం వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో మహారాష్ట్ర కు చెందిన ఎంహెచ్ 18 క్యూ 8888 నెంబర్ గల టవేరా వాహనాన్ని చేయగా పిడిఎస్ బియ్యాన్ని వివిధ సంచులలో నింపి పోరుగు రాష్ట్రమైన కర్ణాటక కు అక్రమంగా తరలిస్తున్నట్లు, నాల్కల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పిడిఎస్ బియ్యం లబ్ధిదారుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రానికి తీసుకెళ్లి అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపాడని, పేద ప్రజలను మోసం చేస్తూ ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న డ్రైవర్ పై కేసు నమోదు చేసి,రేషన్ బియ్యాన్ని ఏఎంసీ సెంటర్ దిగ్వాలకు తరలించినట్లు ఎస్సై దోమ.సుజిత్ తెలిపారు.