గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గం లోని గంగారం మండలం లోని జంగాలపల్లి గ్రామానికి బిజెపి మండల పార్టీ నాయకులు దుప్పటి శ్రీను బానోత్ రవి బుధవారం రోజు బిజెపి పార్టీ విడి కొత్తగూడెం మండలంలో లంబాడ ఆత్మీయ సమ్మేళనం లో జంగాలపల్లి సర్పంచ్ ఇస్లావత్ బాలకృష్ణ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ చేరికయ్యారు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు విరికి ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి కండువాలు కప్పీ పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్బంగా దుప్పటి శీను మాట్లాడుతూ నేను 13 సంవత్సరాలు బీజేపీ పార్టీ లో పనిచేసిన నాయకుడిని ఉమ్మడి కొత్తగూడెం మండల పార్టీ పుట్టించింది నేను సీనియర్ నాయకుడుని అలాంటిది నన్ను కాదని కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు ఇస్తూ నాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకపోవడంతో నేను ఈరోజు బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది ఆయన అన్నారు కచ్చితంగా జ్యోతక్క గెలుపు కోసం పని చేస్తామని ప్రకటించారు…