
మల్లాపూర్ జనవరి 9 నేటిధాత్రి
తేది గురువారం రోజున మండల ప్రాధమిక పాఠశాల రేగుంటలో ఉపాధ్యాయులచే తయారు చేయించిన విద్యార్థుల ఫోటోతో కూడిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు ఫోటోతో కూడిన క్యాలెండర్స్ ఉపాధ్యాయుల సొంత డబ్బులతో అందించడం చాలా అభినందనీయం అదే విధంగా విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడమే కాకుండా పాఠశాల అభివృద్ధికి తో కూడా ఉపయోగపడుతుంది అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో రేగుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుమాల శంకర్ బాబు, ఉపాధ్యాయులు గురుగుబెల్లి నర్సింగరావు,పబ్బ అనిల్, మద్దెల రాజారత్నం,దార గోవర్ధన్, లలిత, రజనీ తదితరులు పాల్గొన్నారు