ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగిని పట్ల అనుచిత ప్రవర్తన..!
నేటిధాత్రి, బ్రేకింగ్, వరంగల్…
100 ద్వారా పోలీసులకు పిర్యాదు చేసిన బంధువులు
మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించిన హాస్పిటల్ ఇన్చార్జి శ్రీకాంత్ రెడ్డి
సారి చెప్పి సద్దుమనిగించే ప్రయత్నం చేస్తున్న యాజమాన్యం
గతంలో కూడా ఇలాగే మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినట్లు సమాచారం
హనుమకొండ “కూరపాటి రమేష్ హాస్పిటల్లో” పనిచేస్తున్న ఉద్యోగిని పట్ల హాస్పిటల్ యజమాని డాక్టర్ రమేష్ అనుచితంగా ప్రవర్తించిన తీరు..
సదరు మహిళ తన భర్తకు ఫోన్ చేసి తన పట్ల డాక్టర్ ప్రవర్తించిన తీరును తెలిపారు. వెంటనే భర్త 100ద్వారా స్థానిక పోలీసులకు పిర్యాదు.
హాస్పిటల్ చేరుకున్న పోలీసులు విచారణ జరిపినట్లు సమాచారం..
విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు హాస్పిటల్ చేరుకోగా, ఇది మా కుటుంబ సమస్య అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు సదరు డాక్టర్..
ఈలోగా హాస్పిటల్ ఇన్చార్జి అని చెప్పుకొనే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మీడియా పట్ల దురుసు ప్రవర్తన.. మేము సర్ది చెప్పుకుంటాం, మీరు ఎక్కువ చేస్తున్నారు బయటకు వెళ్ళండి అంటూ వ్యంగ్య మాటలు..
శ్రీకాంత్ రెడ్డి తీరు పట్ల సదరు డాక్టర్ రమేష్ కు ఫోన్ ద్వారా తెలుపుటకు ప్రయత్నించగా ఫోన్ ఆన్సర్ చేయని డాక్టర్ రమేష్..
గతంలో కూడా హాస్పిటల్ లో కొందరు మహిళా ఉద్యోగినిలపై ఇలాగే దురుసుగా ప్రవర్తించారని, మహిళా సిబ్బందిపై చేతులు వేసేవారిని, హాస్పిటల్ లో పనిచేసి మానేసిన కొందరు ఫోన్ ద్వారా మీడియాకు సమాచారం ఇచ్చారు…
తన కింద పనిచేసే వారిపై బానిసంగా చూస్తూ, ఇష్టం వచ్చినట్లు దుర్భాషాలాడిన ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సదరు మహిళా ఉద్యోగులు కోరుతున్నారు..