వనపర్తి లో పెట్రోల్ డీజిల్ కొరత భారీ స్థాయిలో వాహనాలు క్యాన్లలో పెట్రోల్ డీజిల్ సరఫరా

వనపర్తి లో పెట్రోల్ డీజిల్ కొరత భారీ స్థాయిలో వాహనాలు క్యాన్లలో పెట్రోల్ డీజిల్ సరఫరా

చోద్యం చూస్తున్న సివిల్ సప్లై యి అధికారులు

వనపర్తి నేటిదాత్రి

 



వనపర్తి జిల్లా కేంద్రంలో బస్ డిపో దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ అదేవిధంగా కర్నూల్ రోడ్డు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా బస్ డి పో దగ్గర పెట్రోల్ పంపుల లో క్యాన్లలో ప్లాస్టిక్ డబ్బాలలో వారికి డీజిల్ పోసి ప్రజల వాహనదారులకు బంకు యాజమానూలు ఇబ్బందుల గురి చేస్తున్నారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా మాజీ ఎంపిటిసి బాలస్వామి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆటో యజమాని కొత్త గొల్ల శంకర్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి లో పెట్రోల్ డీజిల్ కొరతపై సివిల్ సప్లై శాఖ కమిషనర్ విఫలమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు వనపర్తి లో జిల్లాస్థాయి అధికారులు ఉన్నారని పెట్రోల్ డీజిల్ కొరతపై సమీక్ష నిర్వహించడం పట్టించుకోకపోవడంపై ప్రజల ఆగ్రహానికి గురవుతారని వారు పేర్కొన్నారు వనపర్తి జిల్లా ఎస్పీగా గతంలో పని చేసిన రావుల గరీధర్ పెట్రోలు డీజిల్ క్యాన్లలో బాటిల్స్ లలో బంక్ యజమానులు పోయకూడదని పెట్రోల్ బంక్ యజమానులకు దిశ నిర్దేశం చేశారని వారు పేర్కొన్నారు వనపర్తి జిల్లా ఎస్పీ గా గతంలో పనిచేసిన రావుల గిరిధర్ వనపర్తి జిల్లా నుండి బదిలీ అయ్యారు అప్పట్లో వనపర్తి జిల్లా ప్రజల రాజకీయ పార్టీల నేతలు ప్రశంసలు అప్పటి ఎస్పీ రావుల గీరీదర్ పొందారు క్యాన్లలో పెట్రోల్ డిజిల్ తీసుకువెళ్లి ప్రజలకు లీటర్ 150 నుండి 200 రూపాయలకు విక్రయిస్తున్నారని వారు పేర్కొన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సివిల్ సప్లై అధికారులపై చుర్యలు తీసుకోని పెట్రోలు డీజీ ల్ కొరత లేకుండా చూడాలని వారు కోరారు వనపర్తి లో బస్ డిపో దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ కర్నూల్ రోడ్ లో ఉన్న పెట్రోల్ పంపులు చిట్యాల రోడ్ హైదరాబాదు రోడ్డు కొత్తకోట రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించి పెట్రోల్ డీజిల్ స్టాక్ చేయకుండా ప్రజల వాహనాలకు విక్రయించేందుకు చ్యరలు తీసుకోవాలని వారు కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version