Chaos on Zaheerabad Highway
జహీరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల అడ్డదిడ్డపు పార్కింగ్
◆:- ట్రాఫిక్ జామ్ తో ప్రజల ఇబ్బందులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో జాతీయ రహదారిపై ఆటోలు, ఇతర వాహనాలు, చిరు వ్యాపారులు తోపుడు బండ్లను అడ్డదిడ్డంగా నిలపడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనివల్ల ప్రజలు, వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యపై స్థానిక ట్రాఫిక్ పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
