నకిలీ ప్రోటీన్ పౌడర్.. 

నకిలీ ప్రోటీన్ పౌడర్.. 

 

 

ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్‌పై ప్రజలలో అవగాహన పెరుగుతోంది. అయితే, అదే స్థాయిలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రోటీన్ సప్లిమెంట్స్ విషయంలో నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌లో విపరీతంగా లభిస్తున్నాయి.

నేటి కాలంలో ఫిట్‌నెస్, బాడీ బిల్డింగ్ పట్ల క్రేజ్ బాగా పెరిగింది. మన శరీర కండరాలను నిర్మించడానికి, శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. రోజువారీ ఆహార పదార్థాలతో పాటు, శరీర అవసరానికి అనుగుణంగా ప్రోటీన్ పొందడానికి చాలా మంది ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. అయితే, మార్కెట్‌లో నకిలీ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఉత్పత్తులు ఎక్కువగా లభిస్తున్నాయి
నకిలీ ప్రోటీన్ కొనడం వల్ల డబ్బు వృధా కావడమే కాకుండా ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. నకిలీ పౌడర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, చక్కెర, స్టెరాయిడ్లు, డిటర్జెంట్లు కూడా ఉండవచ్చు. ఇవి మీ మూత్రపిండాలు, కాలేయం, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. ఎక్కువ కాలం తీసుకుంటే హార్మోన్ల సమస్యలతోపాటు చర్మ సమస్యలను కూడా వస్తాయి. కాబట్టి, మీరు ఉపయోగిస్తున్న ప్రోటీన్ పౌడర్ నిజమైనదా? లేక నకిలీదా? గుర్తించడం చాలా ముఖ్యం. అయితే, ఈ సింపుల్ టిప్స్‌తో నకిలీ ప్రోటీన్ పౌడర్‌‌ను గుర్తించండి..
ప్యాకేజింగ్‌ను పరిశీలించండి

ఇప్పుడు నకిలీ ప్రోటీన్ పౌడర్‌ను గుర్తించడానికి ముందుగా ప్యాకింగ్, లేబుల్‌ను తనిఖీ చేయండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ స్పష్టంగా ఉండాలి. అలా లేకపోయినా స్పెల్లింగ్ లో పొరపాట్లు ఉంటే అది నకిలీ ప్రోటీన్ పౌడర్ అని అర్థం. అసలైన ప్రోటీన్ పౌడర్‌ ప్యాకింగ్ శుభ్రంగా, ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. కాబట్టి, ఏదైనా ప్రోటీన్ పౌడర్ తీసుకునే ముందు దాని బ్రాండ్, బ్యాచ్ నంబర్, తయారీ వివరాలను ఖచ్చితంగా తనిఖీ చేయండి.

 

 

 

 

 

QR కోడ్ లేదా స్క్రాచ్ కోడ్

నకిలీ ప్రోటీన్ పౌడర్‌ను గుర్తించడానికి QR కోడ్‌ను తనిఖీ చేయండి. అసలు బ్రాండ్‌లో స్కాన్ చేయగల QR కోడ్ లేదా సెక్యూరిటీ హోలోగ్రామ్ ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా వాడి అసలైనదేనా అని చెక్ చేయొచ్చు. నకిలీ దానిలో ఈ కోడ్ ఉండదు.

 

 

 

 

 

స్మెల్ చూడండి

నకిలీ ప్రోటీన్ పౌడర్‌ను గుర్తించడానికి దానిని వాసన చూసి రుచి చూడండి. నిజమైన ప్రోటీన్ పౌడర్ రుచి, వాసన ఉంటుంది. నకిలీ ఉత్పత్తులు వింత వాసన లేదా చేదు రుచిని కలిగి ఉండవచ్చు. దీనితో పాటు, నకిలీ ప్రోటీన్ పౌడర్‌ను గుర్తించడానికి మీరు మిక్సింగ్ టెస్ట్ చేయవచ్చు. దీని కోసం, పౌడర్‌ను ఒక గ్లాసు నీటిలో వేయండి. దీనిలో నిజమైన ప్రోటీన్ త్వరగా పూర్తిగా కరిగిపోతుంది. అయితే, నకిలీ ప్రోటీన్ త్వరగా కరిగిపోదు. గడ్డలుగా ఏర్పడతాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!