
బంజారాలకు 285 వ
జయంతి శుభాకాంక్షలు.
బిజెపి జాతీయ అధ్యక్షురాలు డీకే.అరుణ
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ అధ్యక్షురాలు డీకే.అరుణ పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు. డీకే.అరుణ మాట్లాడుతూ,మానవాళికి ధర్మమార్గాన్ని అలవాటు చేసేందుకు సంత్ సేవాలాల్ మహారాజ్ హహర్నిశలూ శ్రమించారు.
తనదైన శైలితో బోధనాలతో బంజారాల మనస్సును గెలుచుకుని..వారిని భాషపరంగా ఏకతాటిపైకి తెచ్చి ధర్మ మార్గంలో నడిచేలా చేశారు..
ప్రకృతిని,వన్యజీవులను కాపాడుకుంటూ తల్లిదండ్రులను మహిళలను గౌరవిస్తూ జీవించాలన్నది ఆయన ముఖ్య నిర్దేశం.
గురువారం రోజు 285 వ,జయంతి సందర్భంగా వారి ఆశీస్సులతో…గిరిజన బిడ్డలు ఎంతో అభివృద్ధిలో మరింత పురోగతి చెందాలని మనసారా ఆకాంక్షించారు.