ప్రతి రంగాన్ని వినూత్నంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం
నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంతో నోట్ల రద్దు
దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం అమలు
అమల్లోకి నూతన విద్యావిధానం
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానం
ప్రైవేటీకరణపై ప్రధానంగా దృష్టి
హైదరాబాద్,నేటిధాత్రి:
నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత సరళతరం చేశారు. ఫలితంగా డిఫెన్స్, రైల్వేలతో సహా వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మా ర్గం సుగమమైంది. ప్రధానిగా నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల పదవీకాలంలో దేశ జీడీపీ ప్రగతి సగటున 5.5%గా నమోదైంది. ఇది అంతకుముందు యు.పి.ఎ. ప్రభుత్వం నాటి 7.03%తో పోలిస్తే తక్కువ. నోట్లరద్దు, మరియు వస్తుసేవల పన్నును అమల్లోకి తేవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతారు. మోదీ ప్రభుత్వం శ్రామిక చట్టాల్లో తీసుకొచ్చిన సవరణలు ప్రపంచ బ్యాంకు, మన దేశంలోని సామ్యవాద మరియు కమ్యూనిస్టు పార్టీలు, శ్రామిక హక్కుల కార్యకర్తల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాయి. అయితే ఈ సంస్కరణలు కొన్ని ప్రధాన ఉద్యోగ సంఘాలనుంచివ్యతిరేకతకు కారణమయ్యాయి. దేశంలోని 11 ప్రధాన యూనియన్లు 2015 సెప్టెంబర్ 2న ఈ సంస్కరణలను వ్యతిరేకిస్తూ సమ్మె చేశాయి. ఈ యూనియన్లలో బీజేపీ అనుబంధ సంఘం కూడా వుండటం గమనార్హం. ఈ సమ్మె కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ 3.7బిలియన్ యు.ఎస్. డాలర్ల మేర నష్టపోయినట్టు అంచనా.
ఇక ఆరోగ్య రంగానికి వస్తే ఆరోగ్యబీమా పరిధిని విస్తరించడం, జాతీయ డయాలసిస్ విధానాన్నిఅమల్లోకి తేవడం, ప్రభుత్వ ఆధీన ఫార్మసీల ద్వారా జనరిక్ మందులను ప్రజలకు మోదీ ప్రభు త్వం అందుబాటులోకి తెచ్చింది. ఈవిధంగా అతి తక్కువ ధరలకే ఔషధాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను ప్రైవేటు హెల్త్‌కేర్ సంస్థలు స్వాగతించగా, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు మాత్రం కేటాయించిన నిధులు అరకొరగా వున్నాయని పేర్కొన్నాయి. కోవిడ్`2019 దేశ ఆర్థిక వ్యవస్థను పెద్ద కుదుపునకు లోనుచేసిందనే చెప్పాలి. 2020 మే నెలలో ప్రధాని నరేంద్రమోదీ, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఉద్దీప్తం చేసేందుకు రూ.20లక్షల కోట్లప్యాకేజీని ప్రకటించారు. 2021 డిసెంబర్ నాటికి కోవిడ్`19 ప్రభావంనుంచి కోలుకొని, తిరిగి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడటం మొదలైంది.
రవాణా
రౖేెల్వే వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా వెయ్యి డిజిల్ లోకోమోటివ్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం జనరల్ ఎలక్ట్రిక్, అల్‌స్టామ్ కంపెనీలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో ప్రైవేటు భాగస్వామ్యానికి తగిన ప్రాధాన్యతను ఇచ్చారు. 2015 డిసెంబర్‌లో మోదీ ప్రభుత్వం, జ పాన్‌తో ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇది ముంబయి`అహమ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టునకు సంబంధించింది కావడం విశేషం. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌ను ప్రధాన బడ్జెట్‌తో కలిపేసింది. గత ప్రభుత్వాలు ఈ రెండు బడ్జెట్‌లను వేర్వేరుగా ప్రవేశపెట్టేవి. అంతేకాదు బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 28 నుంచి, ఫిబ్రవరి 1వ తేదీకి మార్చింది. ఇదేసమయంలో ఆర్థిక సంవత్సరాన్ని జులై నుంచి ఏప్రిల్ వరకు సర్దుబాటు చేసింది.వీటితో పాటు ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్ విధానాన్ని రద్దుచేసింది. మోదీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ)ని కూడా రద్దుచేసింది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడు లకు ఇది పెద్ద అవరోధంగా మారిందని భావించడమే ఇందుకు కారణం.
ఇతర ప్రధాన సంస్కరణలు
నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా కోసం కేటాయింపులను రూ.290కోట్ల నుంచి రూ.361.69 కోట్లకు పెంచింది. దేశంలో సాంకేతిక విద్యతో సహా విద్యారంగానికి కేటాయింపులు జీడీపీలో 2013`14లో 4.44% వుండగా, 2014`15లో దీన్ని 4.35%కు తగ్గించి మళ్లీ 2015`16 ఆర్థిక సంవత్సరంలో 4.56%కు పెంచడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో రాష్ట్రాలకు నేరుగా అందించే వాటా మొత్తాన్ని మోదీ ప్రభుత్వం పెంచింది. ఇదే సమయంలో వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల కింద రాష్ట్రాల కేటాయింపుల్లో కోత విధించింది. మొత్తంమీద చూసుకుంటే రాష్ట్రాల వాటా స్వల్పంగా పెరగడం గమనార్హం. ఒకొక్క రాష్ట్రాన్ని బట్టి కేటాయింపులు జరిపేవిధానాన్ని మార్పుచేయడంతో దేశంలోని 19 రాష్ట్రాలకు కేంద్ర కేటాయింపులు పెరగ్గా, పది రాష్ట్రాలకు తగ్గడం గమనార్హం.
దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసే పథకాన్ని 2015లో ప్రధాని మోదీ ప్రారంభిం చారు. ఈ స్మార్ట్ సిటీల అభివృద్ధి ద్వారా ఐ.టి. రంగానికి సంబంధించి 20బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ స్మార్ట్ విలేజెస్ కార్య క్రమాన్ని కూడా ప్రారంభించారు. దీని కింద గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం, స్వచ్ఛమైన తాగునీరు, కర్బన ఉద్గారాలు లేని ఇంధన వనరులు, పారిశుద్ధ్యం వంటి సదుపాయాల కల్పన ఇందులో భాగం. పార్లమెంట్ సభ్యులు, తమ నియోజకవర్గంలోని గ్రామాల్లో వీటి అమలును పర్యవేక్షించాల్సి వుంటుంది. ఎల్‌పీజీ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకునే విధంగా 2015లో మోదీ ప్రభుత్వం ప్రచారం ప్రారంభించింది. భరించగలిగిన వారు తమ సబ్సిడీని వదులుకున్నట్లయి తే దీన్ని పేదలకు అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రచారం నేపథ్యంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఢల్లీిల్లో మంచి స్పందన లభించింది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువమంది ప్రజలు త మ సబ్సిడీలను స్వచ్ఛందంగా వదులుకున్నారు.
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన
2014, ఆగస్టు నెలలో మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. 150 మిలియన్ల పేదలకు బ్యాంకు ఖాతాలతో పాటు, డెబిట్ కార్డుల సదుపాయం మరియు రూ.5వేల వరకు ఒవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కలిగించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఖాతాలను తెరచినప్పటికీ, కొన్ని ఖాతాలు నిద్రావస్థలోనే వున్నాయన్న విమర్శలు వచ్చాయి. మొత్తంమీద పేదలకు బ్యాంకు ఖాతాలు తెరిపించడం వల్ల ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా వారి ఖాతాల్లోకే జమ అయ్యే అవకాశం ఏర్పడిరది. 2015 ఏప్రిల్ నెలలో ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద వ్యవసాయేతర కార్యకలాపాల కింద ఒక్కొకరికి రూ.10లక్షల వరకు రుణసదుపాయం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పథకాన్ని మూడు కేటగిరీలుగా విభజించారు. 1. శిశు: దీని కింద రూ.50వేల వరకు రుణసదుపాయం, 2. కిశోర్: రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు, 3. తరుణ్:రూ.5లక్షలనుంచి రూ.10లక్షల వరకు. ఈ పథకం కింద పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించినట్టు ఒక సర్వే పేర్కొంది. 2019 మార్చి 8న ప్రధాని నరేంద్రమోదీ కాశీ విశ్వనాథ్ కారి డార్‌కు శంకుస్థాపన చేశారు. గంగానదినుంచి కాశీ విశ్వనాథుని ఆలయం వరకు మార్గాన్ని మరింత అభివృద్ధి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. 2021 డిసెంబర్ 13న ప్రధాని మోదీ ఈ కారి డార్‌ను ప్రారంభించారు.
అందరికీ ఇళ్లు
అందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలో మురికి వాడలు లేకుండా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం పట్టణప్రాంత నిరుపేదలకు 20 మిలియన్ల ఇళ్లను కట్టించి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకోసం2019లో మోదీ ప్రభుత్వం రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. 2016 మే1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించారు. దారిద్య్రరేఖకు దిగువన వున్న (బీపీఎల్) 50మిలియన్ కుటుంబాలకు ఎల్‌పీజీ కనెక్షన్ అందజేయడం దీని ప్రధాన ఉద్దేశం.
దేశంలో వంద త్రిపుల్ తలాక్ కేసులు నమోదు కావడం, సుప్రీంకోర్టు 2017లో వీటికి సంబంధించిన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించిన బిల్లును మోదీ ప్రభుత్వం రూపొందిం చింది. కేంద్రం లోక్‌సభలో ముస్లిం మహిళా బిల్లును ప్రవేశపెట్టగా 2019 జూన్ 25న సభ ఆమోదం పొందింది. రాజ్యసభ జూన్ 30న ఆమోదం తెలపడంతో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీనిపై సంతకం చేశారు. ఆవిధంగా ఈ బిల్లు చట్టరూపం దాల్చడంతో, త్రిపుల్ తలాఖ్ ద్వారా భార్యలకు విడాకులు ఇచ్చినట్టు రుజువైతే అటువంటి భర్తలకు మూడేళ్ల జైలుశిక్ష విధించడానికి వెసులుబాటు కలిగింది. అయితే త్రిపుల్ తలాఖ్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిప్పటికీ చాలామంది భర్తలు వదిలేసిన ముస్లిం మహిళలు ప్రస్తుతం ‘హాఫ్`డైవర్సీలు’గా కొనసాగుతుండ టం విషాదం.
2014లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆరోగ్య విధానం ప్రైవేటీకరణకు ప్రాధాన్యతనిచ్చింది. అయితే ప్రభుత్వ ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచకపోవడం గమనార్హం. 2014, అక్టోబర్ 2న ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ అభియాన్‌ను ప్రారంభించారు. బహిరంగ మలవిసర్జన, మనుషులచేత సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేయించడం (మాన్యువల్ స్కావెంజింగ్)ను క్రమంగా తొలగించడం దీని ప్రధాన లక్ష్యం. మహాత్మాగాంధీ జయంతినాడు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఐదేళ్ల పాటు అంటే మహాత్మాగాంధీ 150వ జయంతి వరకు సాగింది. ఈ కార్యక్రమం కింద
కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో లక్షలాది మరుగుదొడ్లను నిర్మించింది. అదేవిధంగా కొత్త మురుగునీ టిని శుభ్రపరచే ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని కూడా కేంద్రం ప్రకటించింది. మోదీ సంప్రదాయ వైద్యవిధానాన్ని, యోగకు తగిన ప్రాధాన్యతనిచ్చారు. మోదీ ప్రభుత్వం సార్వజనీన ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను ప్రారంభించింది. దీన్నే ‘నేషనల్ హెల్త్ అస్యూరెన్స్ మిషన్’ అని పేర్కొన్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మందులు, చికిత్స, తీవ్ర వ్యాధులకు బీమా సదుపా యం కల్పిస్తుంది. 2018 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద పేద కుటుంబాలకు ఏడాదికి రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపా యం కల్పిస్తారు.
నైపుణ్యాభివృద్ధి శిక్షణ
దేశంలోని యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభించింది. దేశంలో పనిసామర్థ్యమున్న వారిలో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాల ను కలిగించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఈ కార్యక్రమాల అమలును పర్యవేక్షస్తుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడో నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది. అంతకుముందు 1968 మరియు 1986 సంవత్సరాల్లో నాటి ప్రభుత్వాలు విద్యా విధానాలను ప్రవేశపెట్టాయి. 2020లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జాతీయ నూతన వి ద్యా విధానం, స్పందనాత్మక జ్ఞానంతో కూడిన సమాజ రూపకల్పనే ఈ విద్యావిధానం ప్రధాన లక్ష్యం. అందరికీ ఉత్తమ`నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవాలన్న కృతనిశ్చయంతో ప్రభు త్వం ఉన్నది.