చిల్పూర్: (జనగాం) నేటి ధాత్రి
అక్రమ మట్టి రవాన యదేచ్ఛగా అధికారుల అండతో కొనసాగుతుంది స్థానిక నిరుపేదలకు అందించిన భూములలో యదేచ్ఛగా మట్టినిత్వవి సొమ్ము చేసుకుంటున్న కాంట్రాక్టర్లు అధికారులు పలుమార్లు స్థానిక రైతులు మైనింగ్ రెవిన్యూ అధికారులకు చెప్పిన ఫలితం శూన్యం
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని నస్కల్ గ్రామంలో సర్వేనెంబర్ 143 లో నిరుపేదలకు ప్రభుత్వం 105 ఎకరాల భూమిని బహుజనులకు పంచిపెట్టింది. ఇందులో కొంతమంది రైతులను డబ్బులతో ప్రలోభ పెట్టి ఎకరాకు 5 లక్షల చొప్పున ఇస్తామని మట్టి తవ్వుకొని యదేచ్చగా మట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. భారీ గోతులు తవ్వడంతో పక్కనే ఉన్న వ్యవసాయ భూములు గెట్టు దగ్గరకు ఉండడంతో అందులో కూరుకు పోతున్నాయి అని వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములు సంబంధించిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కన తీసిన గోతులకు మట్టి కూర్కుపై వ్యవసాయం చేయకుండా మా భూములు అవుతున్నాయని స్థానిక రెవెన్యూ అధికారులను మైనింగ్ అధికారులను కలిసినప్పటికిని ఫలితం శూన్యం పట్టించుకోవడం లేదని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ఈ స్థలాలలో ఫ్యాక్టరీ నిర్మించే దిశగా చర్యలు చేపట్టి ప్రకటన చేశారు.
అయినప్పటికీ అక్రమార్కులు మధ్యరాత్రి సమయంలో జెసిబిలు భారీ వాహనాలలో ట్రక్కులలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని దీనిపై అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఎవరు వినట్లేదు. ఇప్పటికైనా అక్రమ మట్టి దందాను ఆపివేయాలని స్థానిక రైతులు అధికారులను కోరుతున్నారు.