# హనుమకొండ జిల్లా జెసిపి, ట్రాక్టర్లు, వరంగల్ జిల్లాలో అక్రమ మొరం తవ్వకాలు, ములుగు జిల్లాలో డంపింగ్.
# రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారుతున్న జిల్లా సరిహద్దులు.
# చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు.
# ఒకరి బాధ్యత అంటే మరొకరి బాధ్యత అంటున్న రెవెన్యూ ,నీటిపారుదల శాఖ అధికారులు.
నర్సంపేట నేటిధాత్రి :
రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో చెరువులు ధ్వంసాలకు గురవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ మొరందందా పట్ల రెచ్చిపోతున్నారు.జిల్లా సరిహద్దు ప్రాంతాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారుతున్నాయి.చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, గుట్టలను వదలకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమ దందాతో కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. అక్రమంగా మొరంమట్టి తరలించేందుకు హనుమకొండ జిల్లాకు చెందిన వాహనాలతో వరంగల్ జిల్లాలోని చెరువుల్లోని మట్టిని ములుగు జిల్లాలో ఏర్పాటుచేసుకున్న వెంచర్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొరాన్ని తరలిస్తున్నారు.ఈ మట్టి ఆక్రమణ పట్ల అధికారులకు తెలిసిన చూచి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. సమాచారం అందిస్తే మా శాఖకు బాధ్యత కాదంటే మాది కాదు అంటూ ఒకరి పైన ఒకరు చెప్పుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సంబంధిత రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో పోలారం రెవేన్యూ శికం జిల్లా సరిహద్దులో గల చెరువులో మొరం మట్టిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ మురమ్మట్టి దందా నిర్వాహకులు ఎవరికి అనుమానం రాకుండా హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన జెసిబీ, ట్రాక్టర్లతో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పోలారం గ్రామం జిల్లా సరిహద్దులో గల చెరువు నుండి అక్రమంగా మొరంమట్టిని తీస్తూ ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహమ్మద్ గౌస్ పల్లెలోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ఈ అక్రమ మొరందందా పట్ల అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లోని ఉన్న చెరువులు అక్రమం దందాల పట్ల వాటి రూపురేఖలే మారిపోయి మృత్యు ఘోషాలుగా తలపిస్తున్నాయని ప్రజలు బహుబాటంగానే చర్చించుకుంటున్నారు.కుంటలు,చెరువులను కొందరు వ్యక్తులు విచ్చలవిడిగా తవ్వుతూ అక్రమంగా ముట్టి తరలిస్తున్నడం పట్ల పలుమార్లు సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇస్తే ఒకరికి బాధ్యత అంటే మరొకరికి బాధ్యత ఉన్నది అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో, కుంటల్లో, ప్రభుత్వ భూముల్లో కొన్ని చోట్ల గుట్టల మట్టిని అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా చేపట్టడం పట్ల ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయిన సంఘటన కూడా ఉన్నాయని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను కాపాడాల్సిన సంబంధిత రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా స్పందించి వాటికి అడ్డుకట్ట వేయాలని ప్రజల కోరుతున్నారు. అక్రమ తవ్వకాలు చేపడుతున్న మొరం మట్టి దందా వ్యాపారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.