Illegal Sand Loading Exposed
ఇసుక లోడింగ్ పేరిట అక్రమ వసూళ్లు :రాంశెట్టి మనోజ్
మహాదేవపూర్ నేటి ధాత్రి
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మహదేవపూర్ మండల కేంద్రములో నడుస్తున్నటువంటి ఇసుక క్వారీలో లోడింగ్ పేరిట అక్రమ వసూళ్లు చేస్తున్నారని లారీ డ్రైవర్ల సమాచారం మేరకు ఈరోజు ఇసుక క్వారిలను సందర్శించడం జరిగింది, అలాగే లారీ డ్రైవర్లను లోడింగ్ కు ఎంత తీసుకుంటున్నారు అడగడంతో వారు లోడింగ్ ఛార్జింగ్ పేరిట3600, వాసులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, ఈ విషయమై బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ క్వారీ యజమానితో ఫోన్ లో సంప్రదించగా వారు బజాప్తా లోడింగ్ కు డబ్బులు వాసులు చేస్తున్నామని,చెప్పడం విడ్డురం కలిగించిందని,దీనిపై ప్రాజెక్టు ఆఫీసర్ కూడా ఫోన్ చేసిన రెస్పాన్స్ లేదని,ప్రభుత్వం ఇసుక క్వారీలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూస్తున్నామని, చెప్తున్నా కానీ క్వారీలలో మాత్రం ఇష్ట రాజ్యాంగ వ్యవహారిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమంగా అధిక లోడింగ్ ఛార్జిలు వాసులు చేస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో బీజేపీ మండల్ అధ్యక్షులు రాంశెట్టి మనోజ్,జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్,మండల ప్రధాన కార్యదర్శులు బల్ల శ్రావణ్, లింగంపల్లి వంశీ,బీజేపీ మండల నాయకులు చాగర్ల రవీందర్, కొక్కు రాకేష్, సంతోష్, మహేష్, ప్రశాంత్,పాల్గొన్నారు
