https://epaper.netidhatri.com/view/375/netidhathri-e-paper-12th-september-2024%09
`రైస్ మిల్లర్ల నయా దందా!
`సివిల్ సప్లయ్ శాఖ మిల్లర్ల చేతిలోనే.
`బియ్యం దందాలో రెడ్డిగారి కొత్తపంధా!
`తనవి కాని బస్తాలు తన ఖాతాలో!
`ఎంక్వైరీ ఆఫీసర్ల కళ్లు కప్పారా?
`అధికారుల సహకారంతో అక్రమ దందా నడిపిస్తున్నారా!
`గోడౌన్ ఒక్కటే తిరకాసంతా ఇక్కడే!
`మిల్లర్లంతా చూపించేది ఆ ఒక్కటే.
`ఏళ్ల తరబడి సాగుతున్న తంతే.
`అధికారులకు తెలిసి జరుగుతున్న దోపిడే.
`అధికారులంతా ఉత్సవ విగ్రహాలే.
`మిల్లర్లు ఇచ్చే ముడుపులకు ఆశపడేవారే!
`రహస్యాలన్నీ దాచేది అధికారులే.
`మంత్రికి కూడా లెక్కలు చెప్పరంతే.
`రాష్ట్రవ్యాప్తంగా ఇదే దందా!
`వరంగల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన మచ్చుకే
`ఉన్నతాధికారులను బురిడీ కొట్టించడంలో దిట్టలే.
`రెడ్డి గారితో చేతులు కలిపి కమీషనర్‌నే బురిడీ కొట్టిస్తారంతే.
`ఏకకాలంలో మిల్లులను తనిఖీ చేస్తే బైటపడుతుంది బాగోతం.
`ఎంత మంది మిర్లర్లకైనా గోడౌన్ ఒక్కటే.
`ఏటా వందల కోట్లు మాయమే.
`వేల కోట్లు మెక్కుతూనే అన్యాయమైపోతున్నట్లు గగ్గోలు.
`70 శాతం మిల్లులు నకిలీలే.
`30 శాతం మిల్లులే నిజం.
`మిల్లులు లేకున్న వడ్లు ఇస్తారు.
`ఉత్తిత్తి లైసెన్సులు చూపించి దోచుకుంటారు.
`అధికారుల అండదండలతో ఏళ్ల తరబడి దోచుకుతింటున్నారు.
`జిల్లాలలో కొందరు రింగు మాస్టర్లు…అధికారులకు కోవర్టులు.
`మిల్లర్ల మేలుకోసమే అధికారులు.
దోచుకోవడానికి, దాచుకోవడానికి అక్రమార్కులు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతూనే వుంటారు. ఎంత దోచుకున్నా, ఎంత వెనకేసుకున్నా తరతరాలకు సరిపడా సంపాదన ఇప్పుడే అన్నట్లు తయారౌతున్నారు. సహజంగా వ్యాపారంలో పెట్టుబడి, రాబడి, లాభం వుంటాయి. మిల్లులు, మిల్లర్ల సాగిస్తున్న వ్యాపారంలో మొత్తానికి మోసపు రాబడి వుంది. పైసా పెట్టుబడి లేదు. బస్తా కొన్నది లేదు. గుంట జాగ అవసరం లేదు. అసలు మిల్లు కూడా వుండాల్సిన అవసరం లేదు. గోడౌన్ కట్టుకోవాల్సిన పని అసలే లేదు. మిల్లున్నట్లు దొంగ సర్టిఫికేట్ సంపాదిస్తే చాలు. ఒక చోట ఒక్క గోడౌన్ వుంటే చాలు. మిల్లు లేకపోయినా మిల్లర్లే. కాగితాల మీద వడ్లు చూపిస్తారంతే..రాజుగారి ఒంటి మీద బట్టలు లేకున్నా జేజేలు కొట్టినట్లే..అధికారులు మిల్లులు సందర్శించినట్లే…గోడౌన్లు తనికీలు చేసినట్లే…వడ్ల బస్తాలు లెక్కలు తేల్చినట్లే…ఇదీ ఇప్పుడు ఉత్తుత్తి మిల్లర్ల మాయాజాలం…గోల్ మాల్ గోవిందం………..
తెలంగాణలో రైస్ మిల్లర్లు సాగిస్తున్న అక్రమ, దళారీ దందాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంత కాలం వెలుగులోకి రాని సరికొత్త దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంగతిని పదేళ్లుగా గత పాలకులు పట్టించుకోలేదు. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ప్రభుత్వానికి కూడా ఈ సంగతి ఇప్పటి వరకు తెలియరాలేదు. ఒక రకంగా చెప్పాలంటే మిల్లర్ల మధ్య వున్న రహస్య ఒప్పందాల నేపధ్యంతో జరుగుతున్న విషయాలు పాలకుల దృష్టికి రావడం లేదు. మిల్లింగ్ వ్యవస్థలో ఏం జరుగుతుందన్నదానిపై పాలకులు కూడా దృష్టిపెట్టడం లేదు. వారికి అవగాహన కూడా లేదు. అందుకే మిల్లర్లు ఆడిరది ఆట పాడిరది పాటగా మారుతోంది. మొత్తంగా మిల్లర్లు చిక్కరు, దొరకరు అన్న చందంగా తమ లోగుట్టు వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్మంతా మెక్కెస్తున్నారు. ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. పెద్దఎత్తున ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. మరో వైపు తాము ఇబ్బందులు పడుతున్నామని గగ్గోలు పెడుతున్నారు. అసలు తెలంగాణలో ఎక్కడా ఒక్క మిల్లు కూడా లేని వాళ్లు మిల్లర్లుగా చెలామణి అవుతున్నారు. అక్రమ దందాలు నిర్వహిస్తున్నారు. తామే అసలైన మిల్లర్లుగా పెద్దఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. మిల్లింగ్ వ్యవస్ధ్‌లో తాడు బొంగరం లేని వాళ్లు కూడా మిల్లర్ల అవతారమెత్తుతున్నారు. అంతే కాదు వారికి ఎక్కడా గోదాములు లేకపోయినా, కనిపించిన గోదాములన్నీ మావే అంటూ, ఇతర గోదాంల యజమానులతో కుమ్మక్కై అధికారుల కళ్లు గప్పుతున్నారు.
దోచుకోవడానికి అక్రమార్కులు ఎప్పటికిప్పుడు కొత్త దారులు వెతుక్కుంటారంటే ఇదేనేమో! ఎంత దోచుకున్నా, ఎంత వెనకేసుకున్నా, మిల్లింగ్ వ్యవస్ధలో లెక్కలు లేనంత సంపాదన సాగిస్తున్నారు. మిల్లర్ల అవతారమెత్తి తరతరాల సంపాదనకు ఎగబడుతున్నారు. సహజంగా ఏ వ్యాపారంలోనైనా పెట్టుబడి, రాబడి, మధ్యలో లాభం గురించి చెప్పుకుంటారు. కాని మిల్లులే లేని వాళ్లక పెట్టుబడి లేకుండా లాభాల మీద లాభాలు వచ్చేలా రాబడికి మార్గం వెతుక్కుంటున్నారు. ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. తెలంగాణలో మిల్లర్లుగా చెలామణి అవుతున్న వారిలో చాలా మందికి మిల్లులు లేదు. పైసా పెట్టుబడి లేదు. మిల్లు పేరు మీద గుంట జాగ లేదు. ఎకరాల కొద్ది స్థలాలలో గోదాములు ఏర్పాటుచేసుకోవాల్సిన అసవరం లేదు. తనకో మిల్లు వుందన్నట్లు ఓ దొంగ సర్టిఫికెట్ సంపాదిస్తే చాలు. మిల్లులు లేకపోయినా మిల్లర్లే అవుతారు. కాగితాల మీద వడ్ల లెక్కలు చూపిస్తారు. అందుకు జిల్లాల్లోని అదికారుల పూర్తి సహాకారం ఇందులో ఇమిడి వుంటుంది. దాంతో లేని లెక్కలను ఉన్నట్లు చూపించేవారు కూడ అధికారులే కావడం గమనార్హం. మిల్లర్లు కాని మిల్లర్ల వెనకు అధికారులే వున్నారన్నది నమ్మలేని నిజం. తూతూ మంత్రంగా చేసే తనిఖీలు. ఎవరైనా పిర్యాధులిస్తే చేపట్టే తనిఖీలన్నీ ఉత్తుత్తి తనిఖీలే అంటే ఆశ్చర్యపోక తప్పదు. అధికారులు ఎంతో నియమబద్దంగా విధులు నిర్వర్తిన్నట్లు కలరింగ్ ఇస్తారు. మిల్లులను సందర్శించినట్లు మినిట్లు రాసేస్తారు. గోడౌన్లలో వున్న వడ్ల లెక్కలు కాగితాల మీద చూపిస్తారు. సరిగ్గా వున్నట్లు వడ్ల బస్తాల మీద రిపోర్టులిస్తారు. ఇంకేముంది భబ్రాజమానం..భజగోవిందం…మిల్లర్ల మాయాజాలం…అదికారులకు సంతర్పణం…మిల్లుల యజమానులకు ఆదాయమే ఆదాయం..
తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి సంఘటలను అనేకం కొన్నేళ్లుగా జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ రెడ్డి మిల్లర్ అవతరామెత్తాడు. ఓ సర్టిఫికెట్ సంపాదించాడు. తనవి కాని బస్తాలను మరో గోదాం యజమానితో బేరం మాట్లాడుకున్నాడు. ఆ మిల్లర్ మీద వచ్చిన పిర్యాధులో భాగంగా తనిఖీకి వచ్చిన అధికారులు ఆ గోదాంను పరిశీలించారు. బస్తాలు లెక్కించారు. ఆ గోదాం మిల్లర్ కాని మిల్లర్ రెడ్డిదిగా కాగితాల మీద రాసుకున్నారు. వడ్ల బస్తాల లెక్కలు కూడా సరిగ్గా వున్నాయంటూ లెక్కలు తేల్చారు. ఆ రెడ్డికి పూర్తిగా సహకరించారు. చేతులు దులుపేసుకున్నారు. ఇక్కడ ఎంక్వైరీ అధికారుల కళ్లు కప్పారా? లేక అదికారులకు తెలిసే ఈ తంతు జరుగుతోందా? అన్నదానిపై పెద్ద చర్చ జరుగుతోంది. అధికారుల పూర్తి సహాకారంతోనే ఈ అక్రమ దందా సాగుతోందన్నదానిపై ఎలాంటి సందేహం లేదు. అసలు వరంగల్ జిల్లా కేంద్రానికి సమీపంలో వున్న ఈ గోడౌనే మిల్లర్ల అందరికీ కల్పవృక్షమౌతోంది. అక్షయపాత్రలా మారి ధనాన్ని సంపాదించి పెడుతోంది. ఏ మిల్లర్‌పై పిర్యాధులు వచ్చినా అదికారులు ఏమీ తెలియనట్లు, ఎప్పుడూ చూడనట్లు, అక్కడికి వెళ్లనట్లు అందరు మిల్లర్లకు అదే గోదాంలో వున్న బస్తాలను లెక్కలోకి తెచ్చిపెడతారు. కాగితాల మీద అంతా ఓకే అని తేల్చేస్తారు. అసలు అదికారుల చేతిలో మిల్లర్లు వున్నారా? లేక మిల్లర్లే అదికారులను శాసిస్తున్నారా? అన్నది కూడా తేలాల్సివుంది. అసలు పౌరసరఫరాల శాఖ అదికారులు ఇప్పటి వరకు ఏ ఒక్క మిల్లర్ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అసలు మిల్లర్ల మీద ఎలాంటి పిర్యాధులు రాసిన సందర్భం కూడా లేదు. ఇన్ని తప్పులు, అక్రమ దందాలు జరుగుతున్నా అదికారులకు కనిపించడం లేదా? కనిపిస్తున్నా రక్షిస్తున్నది అదికారులే. అందుకే మిల్లుల మీద చర్యలు లేవు. అసలు మిల్లర్లే కాని వారి మీద కేసులు లేవు. కేవలం మిల్లర్లు ఇచ్చే ముడుపుల కోసమే అధికారులు ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు అనేకం వున్నాయి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతగా మోసం చేస్తున్న నకిలీ మిల్లర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు వెనకేసుకొస్తున్నారు. వారిపై చర్యలకు ఎందుకు రిపోర్టు ఇవ్వడం లేదు. ఇదంతా ఇంత బహిరంగ రహస్యంగా సాగుతున్నా అదికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వుంటున్నారు?
లేని మిల్లుల పేరు మీద బిల్లులు ఇస్తూ, వారికి సహకరిస్తూ, రహస్యాలన్నీ దాస్తున్న వాళ్లే అధికారులు. అసలు ఒక మిల్లు యజమాని మరో మిల్లు యజమానికి చెందిన గోదాంలో వున్న వడ్లను చూపించి లెక్కలు రాయించుకుంటుంటే అదికారులు గుడ్డిగా ఎలా రాస్తున్నారు. వాటిని మోసం చేస్తున్న మిల్లర్ల ఖాతాలో ఎలా వేస్తున్నారు. అక్కడ వున్నది ఒక్కటే గోదాం. ఆ లెక్కలే పదే రాస్తున్నారన్న విషయం పై స్ధాయి వరకు వెళ్లకుండా ఎలా జాగ్రత్తపడుతున్నారు. పై స్ధాయికి కూడా ఈ తంతు అంతా తెలుసా? అన్న అనుమానం రాకమానదు. కాకపోతే ఈ దొంగ దందా పాలకుల దృష్టికి పోకుండా మాత్రం చాలా పకడ్బందీగా మేనేజ్ చేస్తున్నారన్నది మాత్రం తెలిసిపోతుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సంగతి పెద్దగా తెలియకపోవచ్చు. అందుకే వాళ్లుకూడా ఎప్పుడూ దీన్ని ప్రస్తావించిన సందర్భాలు కూడా లేవు. అంటే బోగస్ మిల్లర్లు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణలో వున్న మిల్లర్ల సంఖ్య కంటే మిల్లుల సంఖ్య ఎక్కువగా వుంది. అసలు మిల్లుల సంఖ్య కన్నా మిల్లర్ల సంఖ్య ఎక్కువగా వుండాలి. ఎందుకంటే ఒక్కో మిల్లులో పార్టునర్లు వుండొచ్చు. వాళ్లంతా లెక్కలోకి తీసుకుంటే మిల్లుల సంఖ్య కంటే వారి సంఖ్య ఎక్కువగా కనిపించొచ్చు. కాని ఇక్కడ విచిత్రంగా మిల్లర్ల పేర్ల కన్నా, మిల్లుల సంఖ్య ఎక్కువగా వుంది. అంటే బోగస్ మిల్లర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అంతే కాదు అసలైన మిలర్లు 30 శాతం వుంటే, అసలు బోగస్ మిల్లర్లు 70శాతం వుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అంటే మిల్లే లేకుండా, ప్రభుత్వాదాయాన్ని ఎంత లూటీ చేస్తున్నారో ఇక్కడే అర్దమైపోతుంది. గత పాలకులు ఎలాగూ పట్టించుకోలేదు. కనీసం ప్రజా పాలకులైనా పట్టించుకుంటే వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి చేరుతుంది. ప్రభుత్వానికి గండి పడకుండా వుంటుంది. ముందుగా బోగస్ మిల్లర్లను ఏరిపారేయండి. తనది కాని గోదాంలను చూపిస్తూ మోసం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోండి.