ఐజేయు జిల్లా అధ్యక్ష,కార్యదర్శి లు క్యాతం సతీష్,సామంతుల శ్యామ్
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రం ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఐజేయు జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి నియామకంపై భూపాలపల్లి జిల్లా ఐజేయు జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్, కోశాధికారి చింతల కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ. ఐజేయు జాతీయ సంఘం జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తోందమన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇవ్వడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు స్టేట్ కౌన్సిల్ మెంబర్ సామల శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు సాంబయ్య జిల్లా ఐజేయు జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.