
హనుమకొండ
దేశంలోని ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలలో మాస్టర్స్ చదవడం కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు గణితంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గణిత విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగయ్య తెలిపారు. జాతీయస్థాయిలో ఫిబ్రవరిలో నిర్వహించబడి ఐఐటి జామ్(జాయింట్ అడ్మిషన్ ఫర్ మాస్టర్స్) మరియు సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష కొరకు ఆన్లైన్ ద్వారా గణిత అభ్యర్థులకు రోజు సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు క్లాసెస్ నిర్వహిస్తూ మోడల్ టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనా నుంచి ప్రతి సంవత్సరం గణిత అభ్యర్థుల కోసం ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నామని అనేక మంది విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి మరియు సెంట్రల్ యూనివర్సిటీలలో పీజీ చేస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాలలోని గణిత అభ్యర్థులు ఉపయోగించుకోవాలని, ఫేర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ సహాయంతో నిర్వహించబడుతున్న ఈ శిక్షణకు శివప్రసాద్, యాకుబ్ పాషా, ప్రవీణ్, హనీష్ సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరాలకు కొరకు 9701275354 సంప్రదించాల్సిందిగా డాక్టర్ నాగయ్య తెలిపారు.