
గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపును ఎవ్వరూ ఆపలేరు
ఇంటింటి ప్రచారానికి జన నీరాజనం
చిట్యాల ఏఎంసీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 15
కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను నమ్మితే మోసపోతారనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని చిట్యాల ఏఎంసీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ అన్నారు. బుధవారం మొగుళ్ళపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్..సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని మమ్మరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఆయన విలేకరులనుద్దేశించి మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, భూపాలపల్లి ఎమ్మెల్యేగా గండ్ర వెంకట రమణారెడ్డినే గెలవబోతున్నారన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా మొగుళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించడానికి వెళ్లిన జనం నీరాజనం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. బిఆర్ఆర్ కార్యకర్తలంతా గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కొరకు ఉత్సాహంతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, ఎంపీపీ యార సుజాత సంజీవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు, జడ్పిటిసి జోరుక సదయ్య, తదితరులు పాల్గొన్నారు.