
బీఎస్పి నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు..
శ్రీకాంత్ ముదిరాజ్..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట బిఎస్పి మండల ప్రెసిడెంట్ శ్రీకాంత్ ముదిరాజు వైస్ ప్రెసిడెంట్ గిరి తో పాటు కొందరు నాయకులు శివకుమార్ శరత్ స్వామి కుమార్ సోను నవీన్ తదితరులు శుక్రవారం రోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు..
వారు తీవ్ర మనస్థాపనతో బీఎస్పీ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.బిఆర్ఎస్ పార్టీతోనే ప్రజలకు శ్రీరామరక్ష అని కాంగ్రెస్ వస్తే ప్రజలకు కష్టకాలం తప్పదని శ్రీకాంత్ అన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలిస్తేనే మన గ్రామాల అభివృద్ధి చెందుతాయని, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని, కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తాగునీరు సాగునీరు ప్రజలకు కొదవలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కల్లి బొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తూ, వారి స్వార్థం కోసం వేరే పార్టీ నాయకులు మా పార్టీలోకి రావద్దని చెప్పినవారు మరి ఇప్పుడు ఎలా వారి పార్టీ లోకి చేర్చుకుంటున్నారని మొండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నవాబుపేట మండల నాయకులు వివిధ గ్రామాల యువకులు తదితరులుపాల్గొన్నారు.