తొలి దశ తెలంగాణ ఉద్యమకారుల అందరిని గుర్తించండి

#నెక్కొండ, నేటి ధాత్రి:

స్వరాష్ట్ర తెలంగాణ కోసం 1969 తొలి దేశ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలుకి వెళ్లి ఆరోగ్యాలను ఆస్తులను కోల్పోయిన ఆనాటి ఉద్యమకాలను గుర్తించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతర ప్రభుత్వం పోలీస్, తదితర శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది అయితే వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నర్సంపేట తాలూకా పరిధిలో పోలీసులు వారి రికార్డులను పరిశీలించి నియోజకవర్గంలోని తొలి దశ ఉద్య మంలో పాల్గొన్న పోలీసు రికార్డుల్లో ఉన్న పేర్లను ప్రభుత్వానికి పంపించింది. అయితే గత ప్రభుత్వం వివక్షతతో తొలిదశ ఉద్యమకారులను ప్రస్తుతం వారు ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉంటే వారికి ఇంక్రిమెంట్లు తదితర సహాయ సహకార అందించారు. ఉద్యోగం లేని వారిని నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేసారు. వారికి ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు ఆర్థికంగా పెన్షన్లు ఏవి సమకూర్చలేదు. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలోని 12 మంది ఆనాటి తొలిదశ ఉద్యమకారులు న్యాయస్థానాన్ని ఆచరించారు.27712/2018, నంబర్తో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.న్యాయస్థానం ప్రస్తుత ప్రభుత్వానికి, కలెక్టర్, ఎస్పీ ,ఆర్డీవో ,లాంటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.1969 ఆనాటి తెలంగాణ ఉద్యమ కారులను గత ప్రభుత్వం గుర్తించి అందరికీ సమన్యాయం చేయలేదని కోటును ఆశ్రయించారని ప్రస్తుతం వారి కుటుంబ పరిస్థితి పలు అంశాలను విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో చంద్రుగొండ గ్రామానికి చెందిన వడ్డే లక్ష్మీనారాయణ, బట్టు లక్ష్మయ్య ,పున్నం మణెమ్మ, రోండ్ల అనంతరెడ్డి , మధుసూదన్ రెడ్డి, రోండ్ల మధుసూదన్ రెడ్డి, పున్నం పరీక్షణ్ రెడ్డి, సిహెచ్ మురళీధర్, తిప్పని లక్ష్మి, రాళ్ల బండి సమ్మయ్య, వంగపల్లి సర్వేశం, తదితరులు నెక్కొండ తాసిల్దార్ వేముల రాజ్ కుమార్ కు ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. తాము ఆనాడు పోలీసులతో దెబ్బతిని జైలుకు వెళ్లి వచ్చామని ప్రస్తుత పోలీసులు ప్రభుత్వం నాటి కేసులను రికార్డులను పరిశీలించాలని గత ప్రభుత్వం కొందరికి సహకరించి మమ్మల్ని గాలికి వదిలేయడం సమంజసం కాదని అందుకే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని న్యాయస్థానం మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ప్రభుత్వం నుండి పెన్షన్ లు కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సమరయోధులకు ఇస్తున్న మాదిరిగా స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న మాకు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పత్రిక ముఖంగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *