అధికారం లేకుండా ఎన్నో చేశా..
అధికారం ఇస్తే ఎన్నో చేస్తా..
ఒక్కసారి అవకాశం ఇవ్వండి!
మెట్టు లక్ష్మి సిద్ధరాములు
నిజాంపేట, నేటి ధాత్రి
అధికారం లేకుండానే గ్రామానికి ఎంతో సేవ చేశానాన్నీ అధికారం ఇస్తే మరెంతో సేవ చేస్తానని సర్పంచ్ అభ్యర్థి మెట్టు లక్ష్మి సిద్ధిరాములు తెలిపారు. నస్కల్ లో ఇంటి ఇంటి ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు.. నస్కల్ గ్రామ అభివృద్ధికి దోహదపడుతానని, తనకు చేయూతగా ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని నిరుపేద ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు. ప్రజల్లో మమేకమై.. ఇంటిలో ఒక సభ్యుడిగా పనిచేస్తానన్నారు.
తనపై నమ్మకం ఉంచి బ్యాటు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు.
