https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09/4
ఎంపిగా కరీంనగర్ ప్రగతికి మార్గం వేసాను.
కరీంనగర్ లో గెలుపు నాదే అంటున్న బిఆర్‌ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తో నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు ప్రచార విశేషాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ కోసమే పుట్టింది బిఆర్‌ఎస్.
బిఆర్‌ఎస్ కు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం.
తెలంగాణ తెచ్చిన పార్టీ బిఆర్‌ఎస్.
తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టింది కేసిఆర్.
తెలంగాణ తెచ్చి అన్నపూర్ణగా మార్చింది కేసిఆర్.
బంగారు తెలంగాణ చేసింది కేసిఆర్.
నాలుగు నెలల్లో తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెస్.
అరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్.
పచ్చగా వున్న రైతును మళ్ళీ గోసపుచ్చుకుంటున్నది కాంగ్రెస్.
పచ్చగా కళకళలాడిన తెలంగాణను ఎడారి చేస్తోంది కాంగ్రెస్.
పదేళ్ళలో తెలంగాణకు బిజేపి చేసిందేమీ లేదు.
రూపాయి నిధులిచ్చింది లేదు.
బిజేపి ఎంపి. పైసా తెచ్చింది లేదు.
తెలంగాణ ఉద్యమంలో వున్నది నేనే.
కరీంనగర్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది నేనే.
ఒక్కసారి కరీంనగర్ ప్రజలు బిజేపిని నమ్మితే ఒక్క పని చేయలేదు.
ఎంపిగా తెలంగాణ సమస్యలు అనేకం కేంద్రం దృష్టికి తెచ్చింది నేను.
కేంద్ర నిధుల కోసం కొట్లాడిరది నేను.
కరీంనగర్ లో ఓట్లడిగే నైతికత కాంగ్రెస్, బిజేపిలకు లేదు.
ప్రజల్లో వారికి గుర్తింపు లేదు.
తెలంగాణ ప్రజల గుండెలు పిండుతున్న ఆ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదు.
పార్లమెంటు ఎన్నికలలో కారుదే జోరు.
నమ్మిన ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ నైజం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఇస్తామని చెప్పి పదేళ్లపాటు తెలంగాణ ప్రజలను గోస పెట్టింది కాంగ్రెస్ పార్టీ. గెలిచేదాక తెలంగాణ జపం చేసి, గెలిచాక తెలంగాణను మోసం చేయాలని చూసిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ. దాంతో కాంగ్రెస్ మెడలు వచ్చి, తెలంగాణలో ఉద్యమం రగిలించి, ప్రజల గుండెల నిండా తెలంగాణ నినాదాన్ని నింపింది కేసిఆర్. తెలంగాణకోసం ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ సాధించింది కేసిఆర్. సాధించిన తెలంగాణన అన్న పూర్ణ చేసింది కేసిఆర్. తెలంగాణ బతుకును బంగారంగా మార్చింది కేసిఆర్. పదేళ్ల తర్వాత మరోసారి తెలంగాణను మాయ చేసి, మభ్యపెట్టి అలవి కాని హామీలతో, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన వెనకటి గుణాన్నే చూపిస్తోంది. తెలంగాణ ప్రజలను వంచనకు గురి చేస్తోంది. తన నీతి మాలిన తనాన్ని వదులుకోలేదని మరోసారి నిరూపిస్తోంది. తెలంగాణ ప్రజలను మళ్లీ బాధల్లోకి నెట్టేస్తోంది. ఒక్కనాడు కూడా తెలంగాణ అనని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి, తెలంగాణను మళ్లీ ఆగం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు తెలంగాన అంటే అర్ధం కూడా తెలియదు. తెలంగాణ అస్ధిత్వం ఎంత గొప్పదో తెలియదు. తెలంగాణ ఆత్మ గౌరవం అంతకన్నా తెలియదు. కేవలం డిల్లీ నాయకులకు ముందు మోకరిల్లడం తప్ప కాంగ్రెస్ నాయకులకు మరేం తెలియదు. పదవులుంటే చాలు, అదికారముంటే చాలు తెలంగాణ ప్రజలు ఏమైపోయినా ఫరవాలేదనుకునే గుణం కాంగ్రెస్‌పార్టీది. ఆ పార్టీ నాయకులది. ఓ వైపు తెలంగాణ గొంతెండుతుంటే కూడా పట్టించుకునే తీరిక కాంగ్రెస్ నాయకులకు లేదు. తెలంగాణ పల్లెకు నీటికి గోస పడుతుంటే వినే ఓపిక కాంగ్రెస్ నాయకులకు లేదు. అందుకే పల్లెలు ఏడుస్తున్నాయి. కాంగ్రెస్‌కు శాపనార్ధాలు పెడుతున్నాయి. ఇక బిజేపి తెలంగాణ చేసిందేమీ లేదు. తెలంగాణ మేలు కోరిందేనాడు లేదు. పదేళ్లలో బిజేపి తెలంగాణకు తీరని అన్యాయమే చేసింది. పదేళ్లలో బిజేపి ఇచ్చిన నిదులు లేవు. చేసిన అభివృద్ది లేదు. మాటలు కోట దాటించి, ప్రజలను మతం మత్తులో ముంచి, ఓట్లు దండుకోవడం తప్ప, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బిజేపి చేసిందేమీ లేదు. అందుకే తెలంగాణ ప్రజలు బిజేపిని కూడా నమ్మే పరిస్ధితుల్లో లేరు. తెలంగాణ ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్సే…ప్రజల గుండెల్లో వున్నది కేసిఆరే..అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కారుకు ఎదురులేదని, తెలంగాణ ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్సే అని నిరూపణ జరగబోతోందని, కాంగ్రెస్, బిజేపిలకు తగిన గుణ పాఠం తప్పదని అంటున్న కరీంనగర్ పార్లమెంటు అభ్యర్ధి బోయిన పల్లి వినోద్ కుమార్‌తో నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుకు వివరించిన ఎన్నికల ప్రచార విశేషాలు, తెలంగాణ ప్రజల మనోభావాలు ఆయన మాటల్లోనే…
నేను తెలంగాణ గొంతుకను. తెలంగాణ కోసం కేసిఆర్‌తో కలిసి సాగాను. గతంలో ఎంపిగా కరీంనగర్ ప్రగతినికి మార్గం వేశారు. దేశంలోనే ఎక్కువగా పార్లమెంటుకు హజరైంది నేనే. అదంరికన్నా ఎక్కువగా తెలంగాణ సమస్యలు ప్రస్తావించి, పరిష్కరించేందుకు ప్రశ్నించి, సమస్యల సాధనుకు, అభివృద్దికి నిధులు తేవడం కోసం కొట్లాడాను. కరీంనగర్ అభివృద్దికి బాటలు వేశాను. తెలంగాణ కోసమే పుట్టింది బిఆర్‌ఎస్ పార్టీ. అందుకే తెలంగాణ సాధించింది. తెలంగాణను పదేళ్లలో అభివృద్ధి పలాలు అందించింది. అంత గొప్పది బిఆర్‌ఎస్ పార్టీ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసిఆర్ చేసిన అధ్భుత ప్రగతి ప్రపంచంలోనే ఏ నాయకుడు చేయలేదు. డెబ్బె ఏళ్లుగా వెనకకు నేట్టేయబడి, ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణ పౌరులుగా బతికిన తెలంగాణ ప్రజల్లో ఆత్మ గౌరవం నింపింది కేసిఆర్. అభివృద్ది బాటలు వేసింది కేసిఆర్. పదేళ్లలో పల్లెల రూపు రేఖలు మార్చాడు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలను సస్యశ్యామలం చేశాడు. కరీంనగర్‌ను అన్నపూర్ణగా మార్చాడు. పదేళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఇక భవిష్యత్తు లేదని ఎలాగైనా అధికారంలోకి రావాలని 420 హమీలు ఇచ్చింది. అప్పుడు ప్రజలకు అనుమానం వచ్చింది. కానీ ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీలంటూ అబద్దాలను పదే పదే చెప్పి, ప్రజలను నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు చాలా తొందరగానే ఈ విషయం అర్ధమైంది. కాంగ్రెస్ అంటే కరువు, కరంటు కోతలే అని కేసిఆర్ ఎంత చెప్పినా వినిపించుకోలేదని ప్రజలు మధనపడుతున్నారు. ఎంతో చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మళ్లీ తెలంగాణను గోస పెడుతోంది. నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ బాగోతం బైట పడిరది. ప్రజల సంక్షేమం పక్కన పెట్టి కక్ష్య సాధింపు తప్ప మరేం చేత గాని కాంగ్రెస్ నైజం ప్రజలకు తెలిసిపోయింది. తెలంగాణను ఐదేళ్లపాటు గంగాలం చేసిన కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసి, తెలంగాణకు కరువు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతుల సంక్షేమం విస్మరించి, తన పంతాలు పట్టింపులతో తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేసింది. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేతిలో ఎంత మోసపోయామో అర్దం చేసుకుంటున్నారు. పంటలకు నీళ్లివ్వక, నాణ్యమైన కరంటు ఇవ్వక రైతుల ఆరుగాలం శ్రమను అక్కరకు రాకుండా చేసిన కాంగ్రెస్ పార్టీమీద కసితో వున్నారు. రైతు బంధును రూ.15వేలు చేస్తామని నమ్మించి, అసలుకే ఎసరు పెట్టిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దమౌతున్నారు. రెండు లక్షల రుణమాఫీ పేరుతో ప్రజలు మభ్యపెట్టి మోసం చేసిన కాంగ్రెస్ అంటేనే ప్రజలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. పచ్చగా వున్న తెలంగాణను ఎడారి చేసి ఎండబెడుతున్న కాంగ్రెస్‌కు తెలంగాణలో ఇక నూకలు చెల్లినట్లే.
పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి తెలంగాణకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. తెలంగాణకు విభజన చట్టం హమీలను అమలు చేయాల్సిందిపోయి, తెలంగాణను దగా బిజేపి దగా చేసింది. తెలంగాణలో ఐటి విప్లవానికి తోడు కావాల్సిన ఐటిఐఆర్‌ను గుజరాత్ తరలించుకుపోయి, తెలంగాణ యువత నోట్లో మట్టికొట్టిన బిజేపిని తెలంగాణ ప్రజలు సహించేందుకు సిద్దంగా లేరు. కాజీ పేట కోచ్ ప్యాక్టరీ మీద మిగిలివున్న ఆశలను వమ్ముచేసి, ఆశలను కూడా తుంచేసిన పార్టీ బిజేపి. తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోతలు పెడుతూ, తెలంగాణ ప్రగతిని అడ్డుకున్న బిజేపి. ఒక వేళ తెలంగాణ ప్రజలు పొరపాటున కాంగ్రెస్‌ను నమ్మినట్లు నమ్మితే రైతుల మోటార్లకు మీటర్లు ఖాయం. ఖచ్చితంగా రైతాంగం నుంచి ముక్కుపిండి కరంటు బిల్లులు వసూలు చేయడం తధ్యం. కేసిఆర్ పదేళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడిచేసినా, రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఆపినా రైతులకు అన్యాయం జరగనివ్వలేదు. కాని కాంగ్రెస్, బిజేపిలు రైతులను ఎలా వంచించాలని గోతి కాడ నక్కల్లా ఎదరుచూస్తున్నాయి. అందుకే తెలంగాణ ప్రయోజనాల కోసం పాటు పడేది, పోరాటం చేసేది, తెలంగాణ ఆత్మ గౌరవం నిండి వున్నది ఒక్క బిఆర్‌ఎస్ పార్టీయే. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బిజేపిలకు తగిన గుణ పాఠం ప్రజలు నేర్పుతారు. ఆ పార్టీలకు తెలంగాణలో చోటు లేదని నిరూపిస్తారు. ఇక కరీంనగర్ విషయంలో బిజేపి ఎంపి నమ్ముకున్న మత రాజకీయమే ఆయనకు కర్రు కాల్చి వాత పెడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, ఆయనలో మానవత్వం మేలుకోవడం లేదు. మతం తప్ప ఆయన నోటి నుంచి మరో పదం రావడంలేదు. ప్రజా శ్రేయస్సు గాలిలో కలిసినా పరవాలేదు. ప్రజల మధ్య మతం చిచ్చు పెట్టి ఎన్నికలు రాజకీయం కాచుకోవాలని చూస్తున్న బండి సంజయ్‌కి మరోసారి పరాభవం తప్పదు. కాంగ్రెస్‌కు కరీంనగర్‌లో స్కోపే లేదు. గెలిచేది నేనే. ప్రజలు మావైపే. కేసిఆర్ లేని తెలంగాణ పాలన ఎంత ఆగమ్య గోచరంగా వుందో, ఎన్ని గోసలు పడాల్సివస్తుందో ప్రజలకు తెలిసింది. ఒక్కసారి నమ్మినందుకే ఇంతగా బతుకులు పొయ్యిలో వేసుకున్నట్లైంది. ఇంకా ఆ పార్టీలను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరు. రాజకీయాలు తప్ప, ప్రజా సంక్షేమం పట్టని కాంగ్రెస్, బిజేపిలను ప్రజలు తరిమికొట్టే రోజులు కూడా దగ్గర్లోనే వున్నాయి.