
జమ్మికుంట టౌన్) నేటిదాత్రి
* నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దూ
.కొనుగోలు చేసిన విత్తనాలకు కొనుగోలు రసీదు తప్పనిసరిగా తీసుకోండి.
నకిలీ విత్తనాల నిలువల గురించి గానీ అమ్మకం జరిపిన సమాచారం పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వండి
హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని రైతులకు హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి
తెలియచెయునది ఏమనగా రైతులందరూ కూడా వర్షాకాలం లో పంటలు వేసుకోవడానికి అందరూ దుక్కి దున్ని విత్తనాల కొరకు ఎదురుచూస్తూ ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉండటం వల్ల రైతు సోదరులందరూ కూడా మోసపోకుండా మంచి విత్తనాలను కొనుగోలు చేసి మంచి పంటను మీరు పొందాలని హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో మంచి విత్తనాలతో పాటు నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉన్నందున రైతులు మోసపోకుండా నాణ్యమైన పత్తి విత్తనాలను వరి విత్తనాలను ఎంచుకొని మీ పంట పొలాల్లో నాటుకోవాలని హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీసులు రైతుల సంక్షేమం కొరకు పలు సూచనలు తెలియజేయడం జరుగుతుంది. మీరు మార్కెట్లో విత్తనాలను ఖరీదు చేసేటప్పుడు కచ్చితంగా బిల్లు తీసుకోవాలని ఎక్కడైనా తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి నకిలీ విత్తనాలను తీసుకుంటే ఆ తర్వాత భారీగా నష్టపోతారని అలాంటి నష్టం మీకు వాటిల్లకుండా ఉండాలంటే నాణ్యమైన విత్తనాలను ఎంచుకొని తీసుకోవాలని తెలుపుతున్నాం. ఎవరైనా ఎక్కడైనా నకిలీ విత్తనాలు మీకు ఇవ్వాలని చూసిన మీ దృష్టికి వచ్చిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ సంబంధిత పోలీసు అధికారులకు కానీ లేదా వ్యవసాయ అధికారులకు కానీ సమాచారం అందించాలని కోరుతున్నాం.