Headlines

కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ కు భారీ చేరికలు

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సూరయ్య ఆధ్వర్యంలో చేరికలు

నెక్కొండ, నేటిధాత్రి: మండలంలోని చంద్రుగొండ గ్రామంలోని కాంగ్రెస్ మరియు వివిధ పార్టీలకు చెందిన 15 మంది కుటుంబీకులు శుక్రవారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంగని సూరయ్య ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా సూరయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రతి ఇంటికి కెసిఆర్ పథకాలతో అభివృద్ధి వరద పారుతుందని ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గం లో రాష్ట్రం లో ఎక్కడ లేని విధంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవతో స్పెషల్ జీవో తీసుకువచ్చి 75 కోట్లతో నియోజకవర్గం లోని ప్రతి రైతుకు వ్యవసాయ పనిముట్లు అందే విధంగా చూడడం ఎంతో అభినందనీయమని ఇక నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సురవతో మెడికల్ కాలేజీ, ప్రతి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం, తండాలను గ్రామపంచాయతీ చేసి మునుపెన్నడు ఏ ఎమ్మెల్యే చేయని పనులు చేసి నర్సంపేట ప్రజల హృదయాల్లో కొలువుదీరిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ లో చేరిన కుమారస్వామి, మధుకర్, బియ్యపు రాజు, మాంకాల కుమారస్వామి, బోనగిరి వీరస్వామి, బొనగిరి అనిల్, మామిండ్ల ప్రభాకర్, చాగంటి సమ్మయ్య, పొదిల కుమారస్వామి లతోపాటు మరికొన్ని కుటుంబాలను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బక్కి రాజమ్మ సాంబయ్య, ఉపసర్పంచ్ ఎర్ర సతీష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు, వార్డు సభ్యులు మంకాల మాణి, చిలువేరు లక్ష్మి అశోక్, డాక్టర్ వెంకన్న, ఉసిల్ల నరసయ్య, సిద్రపోయిన సారయ్య, వడ్డే మహేష్, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు బెజ్జం ఏకాంబరం, పిట్టల బిక్షపతి, మంకాల మధుకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!