ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. కాబట్టి ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అంతకంటే ముందు జాబితాలో వారి పేరుందో లేదో ఓసారి చెక్ చేసుకోవాలి.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ చేతిలోని మొబైల్ఫోన్లో సులువుగా ఓటర్ల జాబితాను పరిశీలించుకోండి.
మీకు అందుబాటులో ఉన్న సెర్చ్ ఇంజిన్లో electoralsearch.eci. Gov. in అని టైప్ చేయండి. నేరుగా ఓటర్ సర్వీస్ పోర్టల్ కు వెళ్తారు.
https://electoralsearch.eci.gov.in/
అక్కడ Services సెక్షన్లో Search in Electoral Roll పై క్లిక్ చేయండి.
అందులో Search by Details, Search by EPIC, Search by Mobile అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోండి.
Search by Details ఆప్షన్ ఎంచుకుంటే.. ఓటరు పేరు, తండ్రి/ భర్త పేరు, వయసు, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వివరాలు నమోదు చేసి మీ పేరు ఉందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు.
ఒకవేళ మీ వద్ద ఈ-ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఉంటే Search by EPIC ఆప్షన్తో కూడా ఓటరు జాబితాలో పేరు తెలుసుకోవచ్చు.
మీ ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ లింక్ చేసినట్లయితే Search by Mobile ఆప్షన్ ఎంచుకొని కేవలం మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ సాయంతో సులువుగా జాబితాలో పేరు చెక్ చేసుకోవచ్చు.
గూగుల్ ప్లేస్టోర్లో ఎన్నికల సంఘానికి సంబంధించిన Voter Helpline యాప్లో లాగిన్ అయి కూడా మీ ఓటరు గుర్తింపుకార్డు పై ఉన్న బార్ కోడు, లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కూడా తెలుసు కోవచ్చు.