
Srinivas,
ఇంకెన్నాళ్లు ప్రజల కష్టాలు…
పాకాల యేటి పై హైలెవల్ బ్రిడ్జినిర్మాణం ఇంకెప్పుడు..?
ప్రాణాలు పోతున్న పట్టించుకోరా..?
ఎన్నికల హామీగానే మిగిలిపోయిన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం…
కట్టెబోయిన శ్రీనివాస్ సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు…
నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-
మండల పరిధిలోని రాంపురం పరిసర ప్రాంతంలో గల పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పాలకులకు ఎన్నికల అప్పుడు హామీలకే పరిమితమైపోయిందని సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు కట్టే బోయిన శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం గార్ల మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ,ప్రాణాలు పోతున్న పట్టించుకునే నాథుడే లేడా అని అన్నారు.ప్రజల ఓట్ల మీద ఉన్న శ్రద్ద, ప్రజా సమస్యల పై ప్రజా ప్రతినిధులకు సోయి లేదా అని ఆయన ప్రశ్నించారు.ఇప్పటి నుండి నాలుగు నెలలపాటు ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్న, ప్రజలకు అనారోగ్య సమస్యలు ఏర్పడిన మండల కేంద్రానికి సకాలంలో వైద్యం కొరకు కానీ, విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.విద్యార్థులు తమ విద్యను అభ్యసించాలన్న, రైతాంగం తమ పంటలకు అవసరమయ్యే పరికరాలు మందులు తీసుకొని రావాలన్న చుట్టూ 30 నుండి 40 కిలోమీటర్లు తిరిగి మండల కేంద్రానికి రావలసిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. దూరపు ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో పాకల యేటి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీద నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మండల కేంద్రంకు రావాలని అన్నారు.వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లాలన్న చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని,ఇంకా ఎన్నాల్లు ఈ ప్రాంత కష్టాలు? ప్రజల ఓట్లు దండుకోవడానికి వస్తున్న ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం ప్రజా సమస్య అయినటువంటి పాకాల ఏటిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోతున్నారని అన్నారు.ఇప్పటికైనా ఈ ప్రాంతం నుండి గెలిచిన ఎమ్మెల్యే,ఎంపీలు ప్రత్యేక శ్రద్ధచూపి హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.