ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా లో ఇందిరమ్మ ఇళ్ల.నిర్మాణానికి సంబంధించి రెండవ దశలో ప్రభుత్వ పథకానికి ఎంపికై మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వేగంగా గ్రౌండింగ్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టర్ తన ఛాంబర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కు సంబంధించి అదనపు కలెక్టర్ యాదయ్య తో కలిసి హౌసింగ్ అధికారులతో సమీక్షించారు.
ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు రావడం జరుగుతుందని లబ్ధిదారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఒక్కో మండలం వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణం కొరకు మన ఇసుక వాహనం ద్వారా ఉచితంగా ఇసుక పొందడానికి అవగాహన కల్పించాలన్నారు. మన ఇసుక వాహనం ద్వారా ఇసుక అందించే విషయంపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని మైనింగ్ శాఖ సూచించారు.
సమావేశంలో హౌసింగ్ అధికారులు విఠోబా, ఏఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.