ప్రభుత్వమే ఆదుకోవాలి
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో ఈ ఏడాది ఎండలు అదరగొట్టాయి ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నక్క రాజేందర్, బోయినికుమార స్వామి, బోయిని రాజు కుమార్ ల ఇంటి పై కప్పు లేచి కొట్టుక పోవడం తో పాటు ఇండ్లలోని టీవి లు ఇతర వస్తువులు దెబ్బ తిన్నాయి. కట్టుకునే బట్టలు పప్పులు, ఉప్పులు నిత్యావసరల వస్తువులకు చాలా దెబ్బతిన్నాయి వర్షంలో నిలబడి ఉన్నారు.భారీ వర్షం రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఉన్న ఒక్క గూడు కాస్త చెదిరిపోవడంతో దిక్కతోచని స్థితిలో పడిపోయామని ప్రజాప్రతినిదులు, ఉన్న తాధికారులు స్పందించి ఆదుకోవాలని భాదితులు వేడుకుంటున్నారు.