హోటల్ శరణ్యలో అగ్నిప్రమాదం
వరంగల్ స్టేషన్ రోడ్డులోని హోటల్ శరణ్యలో అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించవచ్చునని పలువురు భావిస్తున్నారు. హూటల్ సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి భారీ నష్టం వాటిల్లకుండా చూశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. లేనిపక్షంలో భారీ ఆస్తినష్టం సంభవించే అవకాశాలు ఉండేవని హూటల్ సిబ్బందితోపాటు పలువురు భావిస్తున్నారు.