Honoring Home Guard Sathyanarayana
బదిలీపై వెళ్లిన హోంగార్డ్ సత్యనారాయణ,
◆:- మండల ప్రజలకు 14 సంవత్సరాలు సేవలందించిన హోంగార్డ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా 14 సంవత్సరాలుగా పనిచేసి సంగారెడ్డి బదిలీపై వెళ్తున్న సత్యనారాయణ, పోలీస్టేషన్ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థాన ఆలయ ధర్మకర్తలు పూజారులు శాలువా పూలమాలతో సత్కరించి సంగమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించరు. అనంతరం ఝరాసంగం ఎస్సై క్రాంతికుమార్ పటేల్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకంటే చాలా కీలకమైనదన్నారు. ఇంతకాలం ఇక్కడ చాలా క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం మన స్టేషన్కి గర్వకారణమని ఇప్పుడు వెళ్లే చోట కూడా ఇంతకన్నా రెట్టింపు పెరు తెచ్చుకోవాలని సూచించారు.
