
పండుగలు పాల్గొన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు భాగ్యరాజ్…
కొల్చారం, ( మెదక్) నేటి ధాత్రి :-
హోలీ పండుగ సందర్భంగా సోమవారం నాడు మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు భాగ్యరాజ్ తూప్రాన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హోలీ సంబరాలు జరుపుకున్నారు. తూప్రాన్ రియల్ ఎస్టేట్ జయ హనుమాన్ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది.
హోలీ పండుగ సందర్భంగా స్థానిక తూప్రాన్ డి.ఎస్.పి గారికి, సిఐ గారికి, ఎస్సై గారికి తుఫాన్ పట్టణ ప్రజలకు,తూప్రాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్, ఆర్ఎంపి పిఎంపి మహమ్మద్అప్సర్ ,పన్నీరు రాము, గడ్డం రవీందర్,ఆకుల కుమార్,మంజునాగరాజు గౌడ్, తాటి గోపి, తాటి విశ్వనాథ్, గడ్డం ప్రశాంత్, మహేష్ యాదవ్,గడ్డం శేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.