ఆటో యూనియన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు..

Auto Union

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామం లో గల మారుతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు రంగు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఎదగాలని అదేవిధంగా మా కష్టాలు తొలగాలని వేడుకల్లో కోరుకోవడం జరిగింది.ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము ఆటోలు నడపలేకపోతున్నామని, ఫ్రీ బస్సుల వల్ల మా ఆటో డ్రైవర్ల ఫ్యామిలీలు రోడ్డున పడవలసి వచ్చింది కాబట్టి మేము బ్రతకడమే చాలా కష్టంగా ఉందని, ప్రభుత్వం మా ఆటో డ్రైవర్ల బాధలు అర్థం చేసుకొని మాకు న్యాయం చేకూర్చాలని ఆటో డ్రైవర్లకు ఈ ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సాయం ఇస్తానని చెప్పడం జరిగింది.కానీ ఇప్పటి వరకు డ్రైవర్లకు రూపాయి కూడా రాలేదని,ఇప్పటికైనా దయచేసి ఈ సంవత్సరానికి 12 వేల ఆర్థిక సాయం అందజేసి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో యూనియన్ సభ్యులంత పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!