ఎస్సిఈయు (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు
మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి యాజమాన్యం సింగరేణిలో గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రం ఇచ్చి వారితోనైనా సమావేశాలు నిర్వహించాలని లేదా అప్పటి వరకు అన్ని యూనియన్లతో సమావేశాలు నిర్వహించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు డిమాండ్ చేశారు. సోమవారం సింగరేణి సిఎండి కి, సింగరేణి డైరెక్టర్లకు, సెంట్రల్ లేబర్ కమీషనర్ (సిఎల్సి) కు డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమీషనర్ (డివై సిఎల్సి) లకు లేఖను పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత డిసెంబర్ 27న సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటివరకు యాజమాన్యం గెలిచిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు అధికారికంగా గుర్తింపు పత్రం ఇవ్వనందున కార్మికుల పలు అపరిష్కృత సమస్యలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. డిప్యూటీ సిఎల్సి వద్ద చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండు సంవత్సరాల కాల పరిమితో గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రం ఇచ్చేంతవరకు అన్ని యూనియన్లతో యాజమాన్యం కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికై వెంటనే సేఫ్టీ, మైన్స్ కమిటీ సమావేశాలతో పాటు స్ట్రక్చరల్ కమిటీ సమావేశాలు అధికారంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.