భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
ఈ సందర్భంగా . విద్యార్థులు హిందీ భాషా ప్రాముఖ్యతను వివరించే ప్రదర్శనలు, నృత్యాలు, పాటలు ప్రదర్శించారు. ఉపాధ్యాయులు హిందీ భాషా ప్రాముఖ్యతను వివరించి, దేశంలోని విభిన్న సంస్కృతులను కలిపే పాత్రను హిందీ భాష పోషిస్తోందని పేర్కొన్నారు. పిల్లలకు హిందీపై ఆసక్తి కలిగించేందుకు పాఠశాలలో వివిధ పోటీలు నిర్వహించబడ్డాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం చేతన్ ,ప్రిన్సిపల్ నీరజ,హిందీ ఉపాధ్యాయ బృందం తస్లీమ్, జరీనా, పాల్గొన్నారు.”