బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఏప్రిల్ 2న హలో.

Education

బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఏప్రిల్ 2న హలో బీసీ..చలో ఢిల్లీ

-బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే

-విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వేముల మహేందర్ గౌడ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

బీసీ రిజర్వేషన్ల అమలు కోసం చేస్తున్న పోరాటం గల్లీలో ముగిసింది..

ఇక ఢిల్లీలో చేపడుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏప్రిల్ 2న చేపట్టిన హలో బీసీ..

చలో ఢిల్లీ కార్యక్రమం సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏప్రిల్ 2న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

బీసీ రిజర్వేషన్ల చట్టం కోసం గల్లీలో పోరాటం ముగిసిందని, ఇక ఢిల్లీలో పోరాటం చేయబోతున్నామన్నారు.

చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో దేశంలోని 29 రాష్ట్రాల నుండి ఢిల్లీని బీసీల దండు ముట్టడించబోతుందన్నారు.

ఏప్రిల్ 2వ తేదిలోగా కేంద్ర ప్రభుత్వం 42 శాతం బీసీ బిల్లు ఆమోదిస్తే విజయోత్సవ సభ పెడతామన్నారు.

కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తే కేంద్రంలోనే అగ్గి రాజేస్తామని హెచ్చరించారు.

బీసీ నినాదాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరన్నారు.

బీసీలను అణగదొక్కాలని చూస్తే వదిలిపెట్టబోమన్నారు.

బీసీలు సర్పంచులు, కౌన్సిలర్లు కూడా కారాదని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీసీలకు అన్యాయం చేస్తే వెంటాడుతాం..మేలు చేస్తే గుండెల్లో దాచుకుంటామన్నారు.

మా పోరాటంతోనే 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు.

హలో బీసీ..చలో ఢిల్లీ కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మహిళలు, విద్యార్థులు, యువకులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిపోతున్నామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!