
గొల్లపల్లి నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్న పేట గ్రామంలో శనివారం గంగిరెద్దుల వారికి మిల్కూరి చంద్రయ్య తండ్రి జ్ఞాపకార్థం మిల్కూరి రాజయ్య పేరుమీద సర్పంచ్ మిల్కూరి అనసూర్య చంద్రయ్య కుటుంబ సమేతంగా 25 వేల విలువ గల కోడెను కొని గంగిరెద్దుల వారికి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామంలోని వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్దలు అందరి సమక్షంలో బహుమతిగా ఇవ్వడం జరిగింది. గతంలో 20 సంవత్సరాల క్రితం ఒక కోడెను కొని ఇవ్వడం జరిగింది. అట్టి కోడె మరణించినందున గంగిరెద్దుల వాళ్లు మళ్లీ వచ్చి అడగగానే అడిగిన వెంటనే మరి ఒక కోడెను కొని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.