
Heavy rain
జహీరాబాద్ నియోజకవర్గం లో వడగళ్ల కూడిన భారీ వర్షం l
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో శనివారము నాలుగున్నర గంటల ప్రాంతంలో అప్పటివరకు భానుడి భగభగతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మార్పు చెంది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

వడగండ్ల వానకు తోడుగా బికర గాలులతో తోడవడంతో ప్రజలు భయాందోళన వచ్చింది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు వానగాళ్లు తో ప్రజలు ఇక్కట్లు

పడ్డారు. సాయంత్రం ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా..
సాయంత్రం కురిసిన వర్షం తో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలోనే ఈ అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో వానగాళ్లు
కూడిన భారీ వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జహీరాబాద్ న్యాల్కల్ కోహీర్ మొగుడంపల్లి ఝరాసంగం మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ఝరాసంగం మండలంలో ఈదురుగాలులతో కూడిన వానకురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోనూ భారీ వర్షం పడింది. భారీ వర్షాలు పడటంతో రైతులకు కొంతమేర నష్టం కలిగింది.