హైదరాబాద్ , నేటిధాత్రి : రాజకీయాలన్నాక ప్రతిపక్షాలు అదును చూసి రాజకీయ వ్యూహాలు పన్నుతూనే అధికార పార్టీ నాయకులు చిక్కుకోవాలని చూస్తూనే ఉంటాయి. అలా మంత్రి హరీష్‌రావు మీద ప్రతిపక్షాలు చేసే కుట్రలు కొత్తేమీ కాదు. వారి వార్తలు ఏనాడు నిజమైన దాఖలాలు లేవు. ఎప్పటికైనా నెరవేరకపోతాయా అనుకునే కలలు తీరేవి కాదు.ఎందుకంటే మంత్రి హరీష్‌రావు లక్ష్యశుద్ధి, చిత్తశుద్ది, లక్ష్యసిద్ధి ఎవరికీ తెలియదు. ఆయన ఆశలు, ఆశయాలు వేరు. అన్నీంటినీ కాదనుకొని తెలంగాణ కోసం త్యాగం చేసిన హరీష్ జీవితం వేరు. ఇవన్నీ ప్రపంచానికి తెలిసినా, ఎప్పటికప్పుడు మసిబూసి మారేడు కాయ చేయాలని ప్రతిపక్షాలు కుటలు పన్నుతూనే వుంటాయి. ఎప్పుడూ కొత్త ఎత్తుగడలు వేస్తూనే వుంటాయి. తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్న వేళ 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ పదహారు సీట్లకు గాను, ఏడు మాత్రమే గెలిచింది. అదే సమయంలో హరీష్‌రావు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ను కలవడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రి అవాయింటు మెంటు ఖరారైనట్లు వచ్చిన సమాచారం మేరకే కలిసిన సందర్భమది. అది కాస్తా పెద్ద వివాదమైంది. అసలు నిజమేమిటో కేసిఆర్‌కు తెలుసు. హరీష్‌రావుకు తెలుసు. కాని హదీష్‌రావు కన్నీరు పెట్టుకునేంత దాకా అసత్య ప్రచారం సాగింది. సిద్దిపేటలో మహిళా డిగ్రీ కాలేజీ కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ను హరీష్‌రావు కలవడం జరిగింది. అంతే నాటి సీమాంధ్ర మీడియా, కాంగ్రెస్ పార్టీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. నాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో వుండే రవిచంద్ర ఈ నాటకం ఆడించారు. ముఖ్యమంత్రి వైఎస్ దగ్గరకు వెళ్తూ ఉత్త చేతులతో వెళ్లడమెందుకని రవిచంద్ర తెలివిగా హరీష్‌రావుచేతికి బొకే అందించడం జరిగింది. అందులో కూడా రాజకీయ కుయుక్తి వుంటుందని తెలియని హరీష్‌రావు బొకే వైఎస్‌కు అందించారు. అది ఫోటోలు తీసి అప్పటికప్పుడు మీడియాకు అందించి ఒక్కసారి తెలంగాణలో రాజకీయ కుదుపుకు ప్రయత్నించారు. కాని క్షణాల్లో దాన్ని తిప్పికొట్టి, జరిగిందేమిటో ప్రపంచానికి చెప్పి తెలంగాణ ద్రోహుల కుట్రను ఎదుర్శొన్న ధీశాలి హరీష్‌రావు. అంటే నాడు ఉద్యమ నాయకుడైనా కేసిఆర్‌ను రాజకీయంగా దెబ్బకొట్టలేక, ఉద్యమం నుంచి దూరం చేయలేక తెలంగాణ (ప్రజల్లో ఆయన నింపుతున్న చైతన్యం చూడలేక ఏన్నో కుట్రలు పన్నారు. అందులో భాగంగా ముందు హరీష్‌రావుకు దూరం చేయాలని చూశారు. కాని కుదరలేదు. ఎందుకంటే మంటత్రి హరీష్‌రావు అంటే కేసిఆర్‌కు ఉండే అనుబంధం గొప్పది.అది తెలియక రాజకీయ గందరగోళాన్ని సృష్టించాలని ఎప్పటిప్పుడూ చేస్తూనే వచ్చారు.
2018 తర్వాత మంత్రి హరీష్‌రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో దాన్ని కూడా చిలువలు పలువలు చేసింది. కేసిఆర్‌కు, హరీష్‌రావుకు దూరం పెరిగితే మాకు లాభమని ఎత్తుగడలు వేసింది. అదీ కుదరలేదు. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒకరకమైన వివాదాలు తెరమీదకు తేవడం అన్నది చూస్తూనే వున్నాం. మంత్రి హరీష్‌రావు వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం కూడా చూస్తూనే వున్నాం. తన జీవితం టిఆర్‌ఎస్ కంటే ముందు కేసిఆర్‌తో ముడిపడివుంది. అలాంటి కేసిఆర్‌ను కాదనుకునే పరిస్థితి హరీష్‌రావుకు ఏనాడు ఉండదు. తన జీవితాన్ని ఇంతగా తీర్చిదిద్దిన తండ్రి లాంటి నాయకుడిని దూరం చేయాలని కుట్రలు చేస్తూనే వుంటారు. ఆ మాయలో ఎవరూ పడిపోవద్దని, తనకు చెడ్డపేరు తేవొద్దని ఆయన అభిమానులకు కూడా హరీష్‌రావు చెబుతుంటారని ఆయన అనుచరులు అంటున్నారు.
– గతానికి విన్నంగా కొత్త కుట్రలు?
గతంలో ప్రతిపక్షాలు చేసిన కుట్రలు ఫలించలేదు. కొత్తగా కుట్రలు తెరమీదకు తేవాలని చూశారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలను కొత్త అస్త్రాన్ని చేసుకున్నారు. ట్రబుల్ షూటర్‌కు ట్రబుల్స్ అని కొత్త ప్రచారం మొదలు పెట్టారు. అదే హరీష్‌రావు, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని ఓడించినప్పుడు ఆశ్చర్యపోయారు. ఎలా సాధ్యమైందని ముక్కున వేలేసుకున్నారు. మంత్రి హరీష్‌రావు చాణక్యాన్ని పైకి ప్రశంసించకపోయినా, ఆయన ఎత్తుగడలను అంచనావేయడం కష్టమనుకున్నారు. కాని దుబ్బాకతో హరీష్‌రావు మీద విషం చిమ్మడం మొదలుపెట్టారు. 2018 ఎన్నికల తర్వాత చాలా కాలం పాటు హరీష్‌రావును దూరం పెట్టారన్న ప్రచారం మరీ విపరీతంగా చేశారు. హరీష్‌రావు మళ్లీ మంత్రి కాగానే కొంత కాలం ఊరుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో మళ్లీ కొత్తకుట్రలకు తెరతీశారు. ఓడిపోయే స్థానాలకు మంత్రి హరీష్‌రావును పంపుతున్నారంటూ, ఎనలేని ప్రేమలను ప్రదర్శిస్తూ, దుష్టనీతిని చూపించుకున్నారు. ఇప్పుడు మళ్లీ పాత కథను ముందుకు తెస్తూ హుజూరాబాద్ విషయంలోనూ అదే విషం చిమ్మారు. అయినా వారి పప్పులు ఉదకలేదు. ఆనక మంత్రి హరీష్‌రావుకు అదనంగా వైద్య ఆరోగ్యశాఖను అప్పగించడంతో కొత్త పంథాను (ప్రతిపక్షాలు ఎంచుకున్నాయి. కొత్త వాదనకు తెరలేపాయి.
ఆరోగ్యశాఖపై అటు అపోహలు…ఇటు హరీష్ పై సానుభూతి పవనాలు
ఇక ఈటెల రాజేందర్ తర్వాత హరీష్‌రావును పక్కన పెట్టేందుకే అచ్చిరాని ఆరోగ్యశాఖను కట్టబెట్టారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అందుకు కొన్ని విషయాలను ఉటంకిస్తూ లేని పోని, వితందవాదాలు చేస్తున్నారు. పుటలకు పుటలు వార్తలు వండించి పత్రికల్లో వార్చుతున్నారు. కనిపించని కుట్రలకు తెరతీస్తున్నారు. గతమంటూ, వర్తమానమంటూ లేని
పోని విషయాలు ముందుకు తెస్తున్నారు. ఈసారి మంత్రి హరీష్‌రావు ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా చూస్తున్నారు. కాని అది జరిగేది కాదు. ఆయన ఎప్పుడూ బెదిరిపోలేదు.
– ప్రస్తుత తరుణంలో కీలక బాధ్యతలు
ప్రతి దాన్ని ఓ సవాలుగా స్వీకరించే తత్వం వున్న నాయకుడు హరీష్‌రావు. హరీష్‌రావు అంటేనే అంకితభావానికి పేరు. అలాంటి నాయకుడు ఉద్యమమైనా, పోరాటమైనా,
అభివృద్ధి అయినా అన్నింటినీ సమపాళ్లలో చూడడం ఆయనకు అలవాటు. అందుకే ఆయనను పనిరాక్షసుడు అని ముద్దుగా పిలుస్తుంటారు. ఎప్పుడు సిద్ధిపేటలో వుంటాడో, ఎప్పుడు హైదరాబాద్‌లో వుంటాడో, ఎప్పుడు గజ్వల్‌లో అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటాడో ఎవరికీ తెలియదు. తెల్లారే సరికి సిద్దిపేటలో వుంటాడు. అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకుంటాడు. ఎప్పుడు తింటాడో, ఎప్పుడు క్షణం కునుకు తీస్తాడో అన్నది ఎవరికీ అర్ధం కానిది. అలాంటి నాయకులు చాలా అరుదు. ఇప్పుడే కాదు ఉద్యమ నాయకుడిగా ఆయన తెలంగాణ జెండా ఎత్తుకున్న నాటినుంచే ఇది అలవాటు చేసుకున్నాడు. అది ఆయన విజయాలకు ఎంతో తోద్చడుతోంది. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నీటి పారుదల శాఖ మంథత్రిగా ఆయనే చేసిన సేవలు ఉజ్వల కీర్తిని అందించాయి. ఓ వైపు మిషన్ కాకతీయ పనులు, మరో వైపు సాగు నీటి ప్రాజెక్టులు. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో అక్కడే హరీష్‌రావు నిద్రలు చేసిన రోజులు కూడ అనేకం వున్నాయి. ఎండనక, వాననక అక్కడే వుంటూ, పనులన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అధికారులతో సమీక్షిస్తూ కొత్త చరిత్ర సృష్టించాడు. నాలుగేళ్లలో ఒక బహుళార్ధక ప్రాజెక్టుకు మించిన ప్రాజెక్టును దగ్గరుండి పూర్తిచేయించాడు. కేసిఆర్ కలలు నెరవేర్చాడు. కేసిఆర్ కలల రూపాన్ని ఆవిష్కరించాడు. ఏకంగా నాటి గవర్నర్‌తో హరీష్‌రావు కాదు, కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు. అదీ హరీష్‌రావు. అలాంటి హరీష్‌రావుపై ఎన్ని కుట్రలు చేసినా విఫలమౌతున్నాయని, తాజాగా ఆరోగ్యశాఖపై కొత్త వాదనలు తెస్తున్నారు.
హరీష్‌రావు నీటి పారుదల శాఖ మంత్రి అయ్యేదాకా అసలు ఆ శాఖ మంత్రులు ఏం చేస్తారన్నది పెద్దగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే గత నలభై ఏళ్లలో ఎంతో మంది భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసినా, వాళ్లు చెరువులు, కుంటల దగ్గర నీటి సవ్వడులు మాత్రమే చూశారు. హరీష్‌రావు నీటి పరుగులు చూపించాడు. గలగల పారుతున్న కాలువలు చూపించాడు. ప్రతి ఊరులో నిండిన చెరువులు చూపించాడు. చెరువులు ఎండాకాలంలో మత్తులు దుంకేలా చేశాడు. మండు వేసవిలో చెరువుల్లో నీళ్లు చూపించాడు. పల్లెల్లో పచ్చదనం చూపించాడు. పచ్చటి పంటపొలాలకు మళ్లీ వేధిక చేశాడు. కొత్తగా ఆవిష్కరించిన చెరువులు చూపించాడు. తెలంగాణ చెరువుల్లో మాయమైన చేపలను చూపించాడు. మత్స్య పరిశ్రమకు మళ్లీ తెలంగాణలో జీవం పోయడంతో కీలక భూమిక పోషించాడు. ఇప్పుడు కూడా ఆరోగ్యశాఖలో అదే చేయబోతున్నాడు. గతంలో ఏం జరిగిందో ప్రజలు మర్చిపోయేలా చేస్తాడు. కొత్త తరం ఆరోగ్యకల్పనలో నూతన ఆవిష్కరణలు చూపిస్తాడు. సహజంగానే తన నియోజకర్ణ్ల ప్రజలైనా, ఇతరులెవరైనా సరే…. ఆయనకు ఒక్క మెసేజ్ పెడితే చాలు వెంటనే స్పందించడం ఆయనకు అలవాటు. కరోనా సమయంలో ఓ జర్నలిస్టు అన్నా… హరీషన్నా… నన్ను కాపాడు అంటూ పెట్టిన మెసేజ్‌తో కదిలి ఆ జర్నలిస్టును కాపాడిని ఘనత హరీష్‌రావుది. ఆయన నియోజకవర్గంలోని ప్రతి ఇంటిలో ఏదో ఒక సాయం కనిపిస్తుంది. ఆయనకు నియోజక వర్గంలోని ఏ కార్యకర్త సమాచారం అందినా సరే…క్షణాల మీద వారికి వైద్య “సేవలు అందిస్తుంటారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో కరఠరోన బాధితులకు పోషకవిలువలున్న కిట్‌ను అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అలాంటి హరీష్‌రావు ఆరోగ్యశాఖ మంత్రి అయితే ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. కొత్త చర్విత లిఖించవచ్చు. పేదలు ఎంతో భరోసాగా వుండొచ్చు. ఆయన సిద్ధిపేటలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయించాడు. వెటర్నరీ కాలేజీ కూడా ఏర్పాటు జరగనున్నది. ఆరోగ్యశాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, నీటి పారుదల శాఖ అంటే హరీష్‌రావు అని ఎలా నిరూపించాడో, ఆరోగ్యశాఖ అంటే కూడా హరీష్‌రావు అని కొన్ని తరాలు చెప్పుకునేలా చేస్తాడనడంలో సందేహంలేదు. కరోనా మూడో తరంగం వస్తుందేమో అన్న సూచనలు అందుతున్న తరుణంలో హరీష్‌రావు కు ముఖ్యమంత్రి అదనపు బాధ్యతలు అప్పగించడంలో ఆయన సామర్థ్యమే కొలమానంగా తీసుకున్నారని చెప్పడంలో సందేహంలేదు. పైగా హుజూరాబాద్ ఫలితాల తర్వాత హరీష్‌రావు ప్రాభవం తగ్గుతుందని ఆశించని వారికి కునుకులేకుండా పోయింది. ఏది ఏమైనా తెరాస జెండాను (గ్రామ (గ్రామాన ఎగురవేశాడు. తన నియోజకవర్ల ప్రజల గుండెల్లొ నిండిపోయాడు. అలాంటి హరీష్‌రావుపై పనిగట్టుకొని చేసే కుట్రలు ఎప్పటికైనా ప్రచారాలుగా మాత్రమే మిగిలిపోతాయి. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు హరీష్‌రావుకు మెండుగా ఉన్నాయి.