`నాణానికి చంద్రబాబు అటు, ఇటు!
`రాజకీయాలలో అందరూ అవకాశవాదులే!
`అధికారం కోసం విన్యాసాలే!!
`సంస్కరణల నుంచి సంక్షేమం బాట!
`రూటు మార్చిన చంద్రబాబు.
`బాబును నమ్మాలా..వద్దా! జనం అయోమయం.
`ఒకనాడు నేల విడిచి సాములు…పదేళ్లు పక్కనపెట్టిన ప్రజలు.
`గత అనుభవాలే నిదర్శనం.
`తెలుగుదేశం మౌలిక రూపానికి ఏనాడో ఎసరు.
`ప్రపంచ బ్యాంకు షరతులు అమలు.
`సంస్కరణల వైపు పరుగులు.
`ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు.
`వ్యవసాయం దండగ అంటూ వ్యాఖ్యలు?
`కంప్యూటరే కడుపు నింపుతుందని గొప్పలు!
`ఇప్పుడు నేల వైపు చూపులు.
`రైతుకు ఏటా 20 వేలంటూ ప్రకటనలు.
`గత ఎన్నికలలో నమ్మం బాబు అన్నారు…
`ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నాడు.
`2004 కు ముందు సిఈఓగా పిలిపించుకునేందుకు ఇష్టపడ్డాడు.
`సంస్కరణలతో జనం నడ్డి విరిచాడు.
`పన్నుల మీద పన్నులేసి వాయించాడు.
`ఇప్పుడు సంక్షేమం వెతుక్కుంటున్నాడు.
`జగన్ ను మించి ఉచితాలిస్తానంటున్నాడు.
`బాబొస్తే జాబొస్తుందనుకున్న జనమే, నిన్ను నమ్మం బాబు అన్నారు.
`ఒకప్పుడు సంస్కరణలే మేలన్నాడు…
`సంక్షేమం భారమన్నాడు.
`వ్యవసాయం దండగన్నాడు…కంప్యూటర్ పండగన్నాడు.
`పోలవరం ప్రచారం ఎంత చేసుకున్నా పూర్తి చేయలేకపోయాడు!
`ఇప్పుడు మళ్ళీ వరాల మూటలు పట్టుకొని వస్తున్నాడు.
హైదరబాద్,నేటిధాత్రి:
చెప్పేది చంద్రబాబు అయితే విని రాసేది విలేఖరి అని ఉభయ తెలుగురాష్ట్రాలలో మీడియాలో నిజమైన సామెత. దాంతో జనం కూడా చంద్రబాబు చెప్పేది వినడం మానేశారు. విలేఖరులు రాస్తున్నది నిజామేనా అని జనం ఒకటికి రెండుసార్లు చర్చించుకుంటున్నారు. విశ్వసనీయత లేని నాయకుడుగా చంద్రబాబును చూస్తున్న జనం, విలేఖరులు రాసేది కూడా నిజమేనా అనుకునే స్ధితికి తెచ్చింది కూడా చంద్రబాబే… తన రాజకీయ స్వార్ధం కోసం వ్యవస్ధలన్నీంటినీ నిండా ముంచిన ఏకైక నాయకుడు చంద్రబాబు. రాజకీయంగా ఆయన ఎదుగుదల కోసం ఎన్టీఆర్ మీద పోటీ చేస్తానని చెప్పాడు. ఎన్నికలు పూర్తయిన మరుక్షణం తెలుగుదేశం పంచన చేరాడు. తన జీవితలక్ష్యాన్ని సునాయాసంగా నెరవేర్చుకున్నాడు. కుటిల నీతిని ప్రదర్శించి అపర చాణక్యుడినని చెప్పుకునే నాయకుడు చంద్రబాబు. రాజకీయాలు చేసేవారందరికీ పదవుల మీద ఆశ వుంటుంది. ఉన్నతమైన పదవులు పొందాలని కోరిక వుంటుంది. కాని కష్టపడకుండానే ఉన్నత స్ధాయికి వెళ్లే అవకాశం కొద్ది మందికే వస్తుంది. ఎన్ని అడ్డదిడ్డమైన పనులు చేసినా, మరో ప్రత్నామ్నాయం లేని రాజకీయాల్లో ఆ నేతలనే జనం ఎంచుకోవడం కూడా జరుగుతుంది. అదే చంద్రబాబుకు వరమెంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు చంద్రబాబుకు ప్రత్నామ్నాయం లేకపోవడం జరుగుతోంది. అందుకే ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు చంద్రబాబు వైపు చూసే అవకాశం వైపు చూసిన పరిస్ధితులు గతంలోనూ వున్నాయి. 2014 ఎన్నికల్లో జనమంతా జగనే గెలుస్తున్నాడని అనుకున్నారు. ఆ జనమే మళ్లీ చంద్రబాబుకు పట్టం కట్టారు. అలా జనం కూడా తన నాడిని తెలియకుండా ఒక్కొసారి వారికి వారే షాక్‌లు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో సాగించిన రాజకీయ విన్యాసం అంతా ఇంతా కాదు. ఆనాటి చంద్రబాబు రాజకీయం నచ్చక ప్రజలు వైఎస్. జగన్‌కు పట్టం కడితే, సంక్షేమం ఒక్కటే పట్టుకొని, ప్రగతిని కొంత జగన్ దూరం పెట్టడంతో మళ్లీ జనం చంద్రబాబు గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తోందా? అన్న అనుమానం కల్గుతోంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు జగన్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. అంటే జగన్ ఎంచుకున్న మూడు రాజధానుల ఆలోచన జనానికి నచ్చలేదని తేలిపోయింది. నిజానికి జగన్ అమరావతి అభివృద్ధిపై దృష్టిపెడితే, మరో దశాబ్ద కాలం పాటు తిరుగుండేది కాదు. కాని వచ్చిన అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకోలేదేమో? అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా చంద్రబాబు మాటలు జనం నమ్మొచ్చా… అన్నది కూడా చర్చనీయాంశమైపోయింది. ఉన్న ఫలంగా చంద్రబాబు సంస్కరణ వాదం నుంచి సంక్షేమం వైపు మళ్లడాన్ని జనం ముక్కును వేలేసుకునేలా చేస్తోంది. ముందైతే అవాక్కవుతున్నారు. సంపద నేనే సృష్టిస్తాను…నన్ను మించిన సంపద సృష్టించే నాయకుడు లేడని చెప్పుకునే మాటలు నమ్మితే మాత్రం చంద్రబాబుకు మరోసారి జనం జేజేలు పలికినట్టే..కాకపోతే చంద్రబాబు చేసిందేమిటి? సంపద పేరుతో చేసిన విద్వంసం ఏమిటన్నది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం వుంది.
నిజానికి చంద్రబాబు సంక్షేమ వాది కాదు.
సంస్కరణల వాది. ప్రపంచ బ్యాంకు షరతులు అమలు చేశారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలకి నేట్టేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే సంక్షేమ భావనల పునాదుల మీద. కాని చంద్రబాబు ఆ పునాదులు పెలికించి వేశాడు. కొంత కాలం జనాన్ని కాల్చుకుతిన్నాడు. రెండు రూపాయల కిలో బియ్యం ధరలు కూడా పెంచాడు. ఐదు రూపాయలపావలా చేసి, సామాన్యుల నోటి కాడి ముద్దను లాక్కున్నాడు. రెండు రూపాయలకే కిలో బియ్యమిచ్చి తెలుగువారి ఆకలి తీర్చినపార్టీ తెలుగుదేశమని మళ్లీ మాయ మాటలు చెప్పి, అవకాశవాద రాజకీయాలను చేసిన నాయకుడు చంద్రబాబు. ఎన్టీఆర్ అందించిన సంక్షేమాలను రద్దు చేసి, ఆఖరకు మద్య నిషేదం ఎత్తి వేసి, మర్చిపోయిన మద్యాన్ని మళ్లీ జనం చేత తాగించిన ఘనుడు చంద్రబాబు. మద్యంతో వచ్చిన ఆదాయాం కూడా సంపద సృష్టిగా చెప్పుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు. ప్రజలకు మేలు చేయాలని, రైతులను తోడు నిలవాలని ఏనాడు కోరుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు సమయంలో రైతులకు ఊరట కల్గించేలా ఎన్టీఆర్ హార్స్‌పవర్‌కు రూ.50 చొప్పున ఏడాది కాలానికి అవసరమైన విద్యుత్ చార్జీనీ వసూలు ఎన్టీఆర్ ప్రభుత్వం వసూలుచేసింది. దాన్ని ఎత్తి చేసి విద్యుత్ ఛార్జీలు పెంచిన నాయకుడు చంద్రబాబు. విద్యుత్ చార్జీల పెంపును రైతులు నిరసిస్తే నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపించిన వ్యక్తి చంద్రబాబు. మరి అలాంటి నాయకుడు అధికారంలో వున్న నాడు రైతుల మీద పగతీర్చుకొని, అధికారంలో లేకపోవడంతో ప్రేమను కురిపిస్తున్నాడు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని కూడా ఎగతాళి చేసి, ఎద్దేవా చేసిన నాయకుడు చంద్రబాబు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే వైర్లు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప, విద్యుత్ సరఫరాకు పనికిరావంటూ చంద్రబాబు వ్యాఖ్యానించాడు. అలాంటి నాయకుడు 2014 ఎన్నికల్లో ప్రజలు అవకాశం ఇచ్చినా, పోలవరం పూర్తిచేయలేదు. అమరావతి నిర్మాణం జరపలేదు. రాజధాని అమరావతి అంటూ జనాన్ని మభ్యపెట్టి, ప్రజాధనంతో చేసిన నిర్మాణాలన్నీ తాత్కాలిక నిర్మాణాలంటే తన చేతగాని తనాన్ని తానే నిరూపించుకున్నారు. జనం చేత చీ కొట్టించుకొని, గత ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూశారు.
తెలంగాణలో మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి, తెలంగాణ సస్యశ్యామలం చేశారు.
అంతకు ముందే మొదలైన పోలవరం మాత్రం చంద్రబాబు పూర్తి చేయలేదు. తెలుగువారి కల నెరవేర్చలేదు. అందుకే జనం చంద్రబాబు మాకొద్దని వదిలించుకున్నారు. అధికారం నుంచి తొలగించారు. ఇక మాటకు ముందు సైబరాబాద్ నేనే నిర్మాణం చేసినా, ఐటి రంగాన్ని నేనే బలోపేతం చేసినా అని చెప్పే చంద్రబాబు ఏనాడు పేద విద్యార్ధుల కోసం చేసిందేమీ లేదు. సాంకేతిక విద్య ఒకప్పుడు అతి ఖరీదైన విద్య. ఆ విద్యను సంపన్న వర్గాలే ఎక్కువగా కొనుక్కొని చదువుకున్నవారే. ఐటి రంగంలో ఉద్యోగాలు అందుకున్నది కూడా వాళ్లే…ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ విద్యను పెంచింది, ప్రైవేటు కాలేజీల ఏర్పాటుకు అనుమతినిచ్చింది…పేదలకు ఆ విద్యను ఉచితంగా అందించింది మాత్రం వైఎస్. రాజశేఖరరెడ్డి. ఆయన మూలంగా కొన్ని లక్షల మంది విద్యార్ధులు ఇంజనీరింగ్ విద్యను రూపాయి ఖర్చు లేకుండా అభ్యసించారు. ఉన్నతమైన స్ధానాల్లో నేడున్నారు. మానవ వనరులను అభివృద్ధి చేసిన ఘనత వైఎస్. రాజశేఖరెడ్డిదైతే, దాన్ని కూడ తన గొప్పగా తన ఖాతాలో వేసుకునేందుకు వెనుకాడని నాయకుడు చంద్రబాబు. ఆనాడు వైఎస్.రాజశేఖరెడ్డి ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకురాకుంటే, తెలంగాణలో ఐటి అన్న పదం ఏనాడో చెదిరిపోయేది.
తనను మించిన అపరమేధావి లేడన్నంతగా గొప్పలు చెప్పుకోవడంలో ఆరితేరిన చంద్రబాబు ఒకనాడు ఒక్కరు ముద్దు..
ఇద్దరు చాలు..మూడో సంతానం వద్దు అంటూ ప్రజలకు చెప్పాడు. ఇప్పుడు దేశ జనాభా పెరగాల్సిన అవసరం వుంది. దేశానికి యువత అవసరం ఎంతో వుందంటూ వ్యాఖ్యానిస్తున్నాడు. అంటే చంద్రబాబు స్వతాహాగా ఆలోచించే నాయకుడు కాదు. కేంద్రంలో వున్న పార్టీలు చెప్పే విషయాలను ప్రచారం చేస్తుంటాడు. దానికి కారణం నేనే అని చెప్పుకుంటాడు. నోట్ల రద్దు నా సలహానే అన్నాడు. తర్వాత నోట్ల రద్దును వ్యతిరేకించాడు. ఇలా యూటర్న్‌ల చంద్రబాబు ఏ పని చేసినా, దాని నుంచి వెనక్కి మళ్లడం ఆపడు. భవిష్యత్తులో బిజేపితో పొత్తు వుండదంటూ, ఆ పార్టీతో పొత్తు చారిత్రక తప్పిదం అన్న చంద్రబాబు మళ్లీ బిజేపి వైపు ఆశగా చూస్తున్నాడు. రాజకీయ అవకాశ వాదం కోసం ఏదైనా మాట్లాడడం చంద్రబాబకు ఆలవాటు. ఇప్పుడు కూడా కర్నాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడం, అక్కడి మ్యానిఫెస్టోను వాడుకొని మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు కొత్తపథకం రచించాడు. మహానాడు సాక్షిగా కొత్త మ్యానిఫెస్టో ప్రకటించాడు. జనం నమ్మితే వాటినైనా అమలు చేస్తాడో లేదో…చూడాలి!