ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పెద్దిని దీవించిన వృద్ధురాలు…

# రాత్రికి రాత్రే ఇద్దరు నాయకులు చేతులు కలిపిండ్లు..
# పోడు పట్టాలకు బ్యాంకు రుణాల బాధ్యత నాదే..
# ఎన్నికల తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం రూ. 2.లక్షలకు పెంపు..


# మళ్ళీ నువ్వే గెలుస్తావు బిడ్డా…..
# ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పెద్దిని దీవించిన వృద్ధురాలు…
# నల్లబెల్లి మండలం నుండి మొదలైన పెద్ది ఎన్నికల ప్రచారం..

నర్సంపేట,నేటిధాత్రి :

నల్లబెల్లి మండలంలోని రంగాయ చెరువు ప్రాజెక్టు ముందు ప్రాంతాలను ముంచేందుకు కుట్రలు చేసినోడు ఓట్ల కోసం మళ్లీ వస్తున్నాడని మోసం చేసినోని పట్ల అప్రమత్తంగా ఉండి తరిమికొట్టాలని నర్సంపేట బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి మండల ప్రజలకు పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికలలో భాగంగా నర్సంపేట టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన సొంత మండలం నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన నమ్మకమైన మూడు చెక్కలపల్లి గ్రామ దేవాలయంలో ముందుగా ప్రత్యేక పూజలను ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తన సతీమణి జడ్పీ ఫ్లోర్ లీడర్ స్వప్న తోపాటు మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి, ఎంపీపీ సునీత ప్రవీణ్ గౌడ్,ఎన్నికల ఇంఛార్జి కన్వీనర్ మురళీధర్ రావు,వైస్ ఎంపిపి గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా లతో
పలువురు ప్రజాప్రతినిధులు నాయకులతో కలిపి నిర్వహించారు.


మూడుచెక్కలపల్లి గ్రామం నుండి మొదలైన ఎన్నికల ప్రచారం భూల్య తండా, ఎర్రచెరువు తండా, వేద నగర్, శంషాబాద్, పాత గోవిందాపూర్,కొత్త గోవిందాపూర్,లైన్ తండా, గ్రామాల్లోని గ్రామదేవతల వద్ద పూజలు నిర్వహించారు. అలాగే టేకుల మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్ది సమ్మక్క గద్దెల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం కొండాపూర్, అసరవెల్లి,రాంపూర్ గ్రామాల మీదుగా మేడపల్లి, గొల్లపల్లి,ఈర్యా తండా, రామారావు తండా.గొల్లపల్లి (గుండ్లపహాడ్), గుండ్లపహాడ్, గాంధీనగర్, ఒల్లే నర్సయ్యపల్లి, మామిoడ్ల వీరయ్య పల్లి, పంతులపల్లి,నాగరాజుపల్లె గ్రామం వరకు ప్రచార యాత్ర కొనసాగింది.అనంతరం నాగరాజుపల్లె గ్రామ సెంటర్ లో నిర్వహించే సమావేశంలో పెద్ది పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్న క్రమంలో మూడుచెక్కలపల్లి గ్రామంలో ఒక వృద్ధురాలు బిడ్డ నువ్వే గెలుస్తావు ఎమ్మెల్యేగా నాకు పింఛన్ వస్తున్నది నా ఓటు నీకే బిడ్డ అంటూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని దీవించింది.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కు ప్రభుత్వం గొప్ప మనసుతో ముసలవ్వలకు ఇస్తున్న ఆసరా పింఛన్ వారికి ఎంతగానో భరోసా ఇస్తున్నదని తెలుపుతూ ఆ భరోసాను మరింత పెంచేందుకు సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రవేశపెట్టారని తెలిపారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నేను మీ నుండి నేర్చుకున్న పాఠాలతో నేడు మీకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. నల్లబెల్లి మండలంలోని రంగయ్య చెరువు ప్రాజెక్టు వలన వేలాదిమంది నిరుపేదల ఇండ్లు మునిగిపోయే విధంగా ఆనాటి మాజీ ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డిలు కుట్రలు చేయగా తెలంగాణ వచ్చాక ముంపు ప్రాంతాలకు ఎలాంటి హాని తలపెట్టకుండా రీ డిజైన్ చేస్తూ ప్రాజెక్టులు పూర్తి చేయగా నేడు గోదారి జలాలతో రెండు పంటలు పండుకున్నారని తెలిపారు. ఈ ప్రాంత ఏజెన్సీ రైతులకు ఉచితంగా 24 గంటల మూడు ఫేసుల కరెంటును అందించేందుకు కొండాపూర్ గ్రామంలో రెండు కోట్ల 20 లక్షల రూపాయల నిధులతో సబ్ స్టేషన్ మంజూరి చేయించాలని తద్వారా మూడు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని ప్రజలకు వివరించారు. నియోజకవర్గాన్ని పాలించిన ఇద్దరు నాయకులు వివిధ పార్టీలో ఉంటూ రాత్రికి రాత్రే చేతులు కలిపి మోసాలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డిలపై ఆరోపించారు. గత 60 ఏళ్లుగా ఈనాడు అభివృద్ధి చెందని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు నేడు తారు రోడ్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని దీంతో భూములకు విలువలు పెరగడంతో రైతులు సంతోషంతో ఉన్నారని పేర్కొన్నారు. ఫారెస్ట్ భూములను దున్నుకున్న పేద రైతులకు ఇఫోర్ ఓఐ చట్టం కింద తోడు భూములకు పట్టాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని ఈ నేపథ్యంలో ఆ పట్టాలు పొందిన భూములకు ప్రభుత్వం నుండి అందించే బ్యాంకు రుణాలను ఇప్పించే బాధ్యత నాదే అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులకు హామీ ఇస్తూ ఇదే తరహాలో మిగిలిన భూములు గిరిజనులతో పాటు బీసీ ఇతర కులాల. రైతులకు పట్టాలు జీఓ త్వరలో రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.కెసిఆర్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రస్తుతం లక్ష రూపాయలు సహాయం అందిస్తుందని ఎన్నికల తర్వాత రెండు లక్షల రూపాయలు అందించనున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో పట్ల ప్రజలు ఆసక్తి చూపడం సంతోషకరమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలియజేశారు.

# మళ్ళీ నువ్వే గెలుస్తావు బిడ్డా…

తెలంగాణా ప్రభుత్వం కేసీఆర్ గారు గొప్ప మనసుతో ముసలవ్వలకు ఇస్తున్న ఆసరా పించన్ వారికి ఎంతో భరోసా ఇస్తుంది.వారి గుండెల్లో నిండిన అభిమానాన్ని ఎమ్మెల్యే పెద్ది ఎన్నికల ప్రచారంలో ఓ ముసలవ్వ తారసపడి ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి 2 వేల పెన్షన్ 5 వేలకు పెంచుతున్నారట కదా బిడ్డా మాకు పెద్ద కొడుకులా ఆసరా పెన్షన్ ఇస్తున్న ‘కేసీఆర్,మీరు సల్లంగ ఉండాలి బిడ్డా మా ఓటు మీ పార్టీకే అంటూ ఆశీర్వదించింది.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ మాజీ జెడ్పిటిసి హరినాథ్ సింగ్, కొత్తపెళ్లి కోటిలింగాచారి, నానబోయిన రాజారాం యాదవ్, సట్ల శ్రీనివాస్ గౌడ్, శివాజీ, ప్రభాకర్ రావు, మోహన్ రావు, సుంకరి సంతోష్ రెడ్డి, పల్లాటి జైపాల్ రెడ్డి, పెద్ది శ్రీనివాస్ రెడ్డి, రాజన్న నాయక్ పలువులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!