హరితహారానికి సిద్దమైన నర్సరీ
హసన్‌పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో నర్సరీని ఎపిఎం విజయలక్ష్మి సోమవారం సందర్శించారు. నర్సరీ మొక్కలు వర్షాకాలం దగ్గర పడటంతో నర్సరీలోని మొక్కలు నాటడానికి సిద్దం చేయాలని అన్నారు. ప్రతి ఇంటికి రెండుమొక్కలు నాటాలని, రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటాలని, వాటిని కాపాడే బాధ్యత అందరూ తీసుకోవాలని తెలిపారు. టేకు, దానిమ్మ, సీతాఫలల చెట్లు, పూలమొక్కలు, నీడనిచ్చే మొక్కలు రాబోయే తరం వారికి కూడా ఉపయోగపడేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పచ్చని చెట్లు-ప్రగతికి మొట్లు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ కొండ రాజ్‌కుమార్, టిఎ సృజన సుదర్శన్, అశోక్, గ్రామ సర్పంచ్ చిర్ర సుమలత, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.