– కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
మాజీ మంత్రి హరీష్ రావు మతిభ్రమించి వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడుతున్నాడని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ముస్తాబాద్ మండలం నామాపూర్ కు చెందిన నకీర్తి కనకవ్వకు 31 భూమి ఉంటే 1600 లు మాత్రమే రైతు భరోసా ఆమె ఖాతాలోకి వచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొనడం సిగ్గుచేటని మహేందర్ రెడ్డి అన్నారు. వాస్తవాలను పరిశీలించడం జరిగిందని 589, 943 సర్వేనెంబర్ లలో ఆమెకు 11 గుంటల భూమి మాత్రమే ఉందని ఆ భూమికి సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం 1650 రూపాయలు చెల్లించిందని ఆ మహిళా రైతుకు వచ్చే రైతు భరోసా అంతేనని ఆయన పేర్కొన్నారు ప్రజలను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మానుకోవాలని మీపై ప్రజలకు నమ్మకం లేకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అయినా ఇంకా బుద్ధి రావడం లేదని మహేందర్ రెడ్డి అన్నారు. రైతు భరోసాలో ప్రభుత్వం కోతలు విధిస్తుందని అనడం హరీష్ రావు కు సిగ్గుగా అనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలతో లబ్ధి పొందాలని చూస్తున్నారని అది జరగదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మీ ప్రభుత్వాన్ని కూలగొట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినప్పుడే బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూసిన ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.