నూతన పార్క్ లో ఆహ్లాదకర వాతావరణం, ఎంతో ఆనందం.
సాయంత్రం వేళల్లో సేదతీరుతున్న స్థానికులు.
ఆటపాటలు, మార్నింగ్ వాక్, ఎక్ససైజ్ సదుపాయం, మండల కేంద్రంలోని పార్క్ చిన్నారులతో ఫుల్.
మండల కేంద్రంలో పార్క్ ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగం, సెల్ ఫోన్లకు పరిమితమైన ప్రజలు, ఫిట్నెస్ వైపు దృష్టి.
మహదేవపూర్ -నేటి ధాత్రి;
పార్కులు పట్టణాలకే పరిమితం అన్న విషయం ఇప్పుడు మారిపోయింది, గత ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం అవి గ్రామాలకు ఊరి చివరికి ఉండడం ప్రజలకు ఇలాంటి ఉపయోగం లేకుండా పోయింది.
మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో పెద్ద మొత్తంలో ఉన్న ఖాళీ స్థలంలో నూతన పార్కును ఏర్పాటు చేయడం మండల కేంద్ర వాసులకు ఎనలేని ఆనందాన్ని కలిగించింది. మండల కేంద్రంలో పార్క్ సదుపాయం లేకపోవడంతో చిన్నారులు యువకులు మండల కేంద్ర ప్రజలు సెలవు దినాల్లో ఆహ్లాదకర వాతావరణం లేకపోవడంతో ఇండ్లకె పరిమితం అయి, సెల్ఫోన్ల ఉపయోగంతో సెలవు దినాలను గడుపుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు మండల కేంద్రంలోని ఒక అధునాతనమైన పార్కును ఎంపీపీ రాణి బాయ్ రామారావు, ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి ఈనెల మూడవ తేదీన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు, ఎంపీపీ రాణి బాయ్ ప్రత్యేక శ్రద్ధతో పార్కును ఏర్పాటు చేసి ప్రజలకు ఒక అహ్లాదకర వాతావరణం అందించి పార్కును ఏర్పాటుచేసి శభాష్ అనిపించుకున్నారు.
** *** ***
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండల పరిషత్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో,8.50, లక్షల వ్యయంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్క్ పేరును నామకరణం చేసి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల మధ్య ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ పార్కును ఏర్పాటు చేసి 8 రోజులు పూర్తవుతున్న క్రమంలో, ఒకరోజు ఆదివారం సెలవు దినం తోపాటు మిగతా రోజులు కూడా పార్క్ చిన్నారులు గ్రామస్తులతో ఉదయం మరియు సాయంత్రం కళ కళ లాడుతుంది
ఒక సారి పార్కులో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి పార్కును వదలేసి వచ్చే వరకు పులతోటలో విహరిస్తున్నట్టుగా ఉంటుందని, పార్కును సందర్శించిన మండల కేంద్ర వాసులు అంటున్నారు.
కుటుంబ సమేతంగా, పెరుగుతున్న సందర్శకుల సంఖ్య.
సాయంత్రం వేళల్లో వాకింగ్ పచేసుకోవడానికి వాకింగ్ ట్రాక్, పచ్చదనం పెంచే మొక్కలు, చిన్నారులు ఆడుకునేందుకు కీడ్రా వస్తువులు ఏర్పాటు చేశారు. యువత జిమ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్‌ను సైతం ఏర్పాటు చేశారు. దీంతో మొన్నటి వరకు సెల్ఫోన్లతో సెలవు దినాలను సైతం ఇండ్లలో గడుపుకునేవారు ఈరోజు అంబేద్కర్ పార్కు బారులు తీరుతున్నారు.
చిన్నా పెద్దా తేడా లేకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. సెలవు దినాల్లో కుటుంబ సమేతంగా పిల్లలతో కలసి పార్కులో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. కొత్తగా ఇప్పుడే పార్క్ ప్రారంభం కావడం అనేక మొక్కలు కూడా నాటడం జరిగింది, చిన్న చిన్న మొక్కలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి, అలాగే చుట్టుపక్కల కార్యాలయాల్లో కూడా పెద్ద మొత్తంలో చెట్లు ఉండడం అంబేద్కర్ పార్కుకు మరింత కళ తీసుకువచ్చింది. పార్కులు ఆకర్షనీయమైన కుర్చీలను ఏర్పాటు చేయడం, చిన్న పిల్లలకు అనేక ఆట వస్తువులను అందుబాటులోకి తీసుకురావడంతో చిన్నారులు తల్లిదండ్రు తో సందర్శకుల సంఖ్య పెరుగుతుంది.
ఆటా,పాట అంతా అక్కడే.
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ పార్క్ చిన్నారులకు ఒక వరంగా మారింది, ప్రతిరోజు సాయంత్రం మండల కేంద్రానికి చెందిన పెద్ద మొత్తంలో చిన్నారులు దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులకు, యువకుల జిమ్ కొరకు ఎంతో ఉపయోగంగా మారింది. ఉదయం సాయంత్రం పెద్ద మొత్తంలో చిన్నారులు తల్లిదండ్రులతో పాటు పలు చిన్నారులు తమ బైస్కిల్ ద్వారా భారీగా పార్కు వద్దకు చేరుకొని ఆట సామాగ్రీ లతో చిందులు వేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆదివారం సెలవు దినం రావడంతో అంబేద్కర్ పార్క్ చిన్నారులు తల్లిదండ్రులతో కళ కళ లాడింది, అలాగే మండల కేంద్ర వాసులకు సీత తీర్చుకునే కొరకు మండలంలో పార్క్ సదుపాయం లభించడంతో పెద్ద మొత్తంలో గ్రామస్తులు పార్కులు ఏర్పాటు చేసిన కుర్చీలకు పరిమితమై సంతోషిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మార్నింగ్ మరియు ఈవినింగ్ నడక ఎంతో ప్రాధాన్యత ఉండడంతో మండల కేంద్రంలో వాకింగ్ కొరకు జాతీయ రహదారి పై ఆధారపడిన ప్రజలు వాహనాలు లారీల రాకపోకలతో భయభ్రాంతులకు గురయ్యేవారు, కానీ ఇప్పుడు అంబేద్కర్ పార్క్ లో వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడంతో దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులు పార్కులో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ లను పెద్ద మొత్తంలో ఉపయోగిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ జిమ్ కొరకు ఏర్పాటు చేసిన వస్తువులు కూడా యువకులు పెద్ద మొత్తంలో ఉపయోగించుకొనుటకు రావడం జరుగుతుంది.
* ** **
మండల కేంద్రంలో పార్క్ ఏర్పాటు హర్షణీయం. మరిన్ని వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
మండల కేంద్రంలో పార్క్ ఏర్పాటు చేయడం ఆంట్ లేని ఆనందమని, సాంకేతిక అలవాట్లకు దూరమై ఆరోగ్యకరమైన అలవాట్లు, ఆహ్లాదకర వాతావరణం తో గ్రామస్తులు మరియు చిన్నారుల్లో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా పార్కులు ఏర్పాటు చేసిన ఎంపీపీ రాణిలకు ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నారు గ్రామస్తులు. అలాగే పార్కులు మరిన్ని వృక్షాలు ఏర్పాటు అలాగే కుర్చీల సంఖ్య పెంచడం, చిన్నారుల ఆట వస్తువుల్లో మరికొన్ని ఆట వస్తువులను ఏర్పాటు, చేసి వాటిలో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్, మంచినీటి సదుపాయం కొరకు నల్లాలు పెట్టడం, రాత్రి సమయంలో వెలుతురు కొరకు ప్రత్యేక లైటింగ్, ఏర్పాటు చేయాలని
స్థానికులు అధికారులు మరియు జిల్లా కలెక్టర్ తో కోరుతున్నారు