ప్రపంచ కార్మికుల దినోత్సవం వర్ధిల్లాలి

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో గల పలు గ్రామాల్లో ఎం సి పి ఐ యు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన జెండాలు ఎగురవేశారు. అధ్యక్షుడు మాట్లాడుతూ ఎన్నో ప్రాణ త్యాగాలు ఎన్నో అమరవీరుల గుర్తులు అందరికీ వందనాలు స్ఫూర్తిని నిలిపి వెలుగును పంచే కార్మికుల ఆశయాల సాధన దినం కార్మికుల సమైక్య దినం మే డే’.1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన, ప్రదర్శన చోటు చేసుకున్నాయి.1రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధానడిమాండ్.ప్రపంచ వ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం పరిపాటైంది.1923లో మొదటిసారి భారతదేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి ‘మే డే’ను పాటించడం జరుగుతుంది.
ఈనాడు శ్రమ దోపిడీకి బలవుతున్నది. రాత్రుళ్లు ఆడపిల్లలను భద్రతలేకుండా ఇళ్ళకు పంపించడం మూలంగా నేరాల సంఖ్య కూడా పెరుగు తున్నది.పెట్టుబడిదారీ వ్యవస్థ వున్నంత వరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. ఈ కార్య క్రమంలో ఎం సిపిఐ యు మండల అధ్యక్షుడు భద్రయ్య మంద, కార్యవర్గ సభ్యుడు రంజిత్, పత్తిపాక గ్రామ అధ్యక్షుడు అంకేశ్వర పు మల్లయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!