
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు అర్బన్ అధ్యక్షులు శ్యామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ 123వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషేధర్ రెడ్డి హాజరై శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఆవరణంలో మొక్క నాటడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది శ్యాం ప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడని భారతీయ జనస్థానం స్థాపించి ఆధునిక హిందుత్వం హిందూ జాతీయ వాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు వారి యొక్క జయంతి సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషకరమైనటువంటి విషయమని మొక్క నాటడం ద్వారా భావిత్వరాలకు వృక్ష సంపదను అందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చునని ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు ఎస్పీ మోర్చా రాష్ట్ర నాయకులు బట్టు రవి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలసాని తిరుపతిరావు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శశి కుమార్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సత్యవతి అర్బన్ ప్రధాన కార్యదర్శి తమ్మి రామ్ రెడ్డి అర్బన్ ఉపాధ్యక్షులు కోరే సుధాకర్ ఊరేటి మునీందర్ గ జిల్లా నాయకులు కొమురయ్య భాస్కరరావు వేణు రావు బీజేవైఎం నాయకులు సయ్యద్ గాలిఫ్ శంకర్ రాజు అర్బన్ నాయకులు సేనపతి ఎర్ర రాకేష్ రెడ్డి సునీల్ తదితరులున్నారు