ఘనంగా లూసిస్ బ్రెయిలి జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పూర్వ ప్రాథమిక విద్యా పరికరాలు అంగన్ ప్రీ స్కూలు పిల్లలకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమం శనివారం ఐడిఓసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని పిల్లలకు పరికరాలు దుస్తులను అందజేశారు.ఈ సందర్భంగా శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతో సహాయపడుతున్నాయని కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు ప్రతి అంగన్వాడీకి చేరాలనే లక్ష్యంతో పని చేయాలని సూచించారు. జిల్లాలోని రెండు అంగన్వాడీ ప్రాజెక్టు లకు 394 ర్యాక్స్, 334 రౌండ్ టేబుల్స్, 334 రెక్టాంగిల్ టేబుల్స్, 408 మ్యాపులు పంపిణీ చేశామని అన్నారు.

ఘనంగా లూసిస్ బ్రెయిలి జన్మదిన వేడుకలు

అదే విధంగా లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.లూయిస్ బ్రెయిలీ కంటిచూపు లేని వారికోసం ఎంతో శ్రమపడి లూయిస్ బ్రెయిలి కనిపెట్టారని అన్నారు. లూయిస్ బ్రెయిలి జీవితంలో చేసిన విశేష సేవలను గుర్తుచేసుకుంటూ అంధుల కోసం తయారు చేసిన బ్రెయిలీ లిపి మహత్తరమైన ఆవిష్కరణ అని ఆయన సేవలను కొనియాడారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ అంగన్వాడీ నుండే నుండి బాల్యం బలోపేతం కావాలని, ఆరోగ్యవంతమైన నవసమాజం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మీ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. పిల్లకు బాలామృతం అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీకేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు రంగులు వేయు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమాలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య, సీడీపీఓ లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!