
Hanuman Jayanti
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు
మందమర్రి నేటి ధాత్రి:
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని, ఆలయ రజతోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి పంచముఖ హనుమాన్ ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిదండి రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో 108 మంది పూజారుల మంత్రోచ్ఛారణ 108 కళాశాలతో వాయు పుత్రునికి అభిషేకం నిర్వహించారు.

భక్తుల శ్రీరామ నామ స్మరణ నడుమ 108 కళాశాలలోని పంచామృతాలు, పండ్ల రసాలు, వివిధ జలాలు పంచామృతాలతో స్వామి వారికి జరిపించిన అభిషేకం చూసి భక్త జనులు పులకరించిపోయారు. ఈ సందర్భంగా ఐదు రోజులుగా జరుగుతున్న రామాయణ హోమం ఈరోజుతో ముగిసింది. అంతకుముందు ఆలయం పై భాగంలో సుదర్శన చక్రాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.