హంతకులను కఠినంగా శిక్షించాలి
బక్కి శ్రీను హంతకులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యుసిసిఆర్‌ఐ (ఎంఎల్) కిషన్‌వర్గం రాష్ట్ర నాయకుడు గడ్డం సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్కి శ్రీను హంతకులను కూడా శ్రీనును చంపిన విధంగానే ఉరితాడుకు వేలాడేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలని జెఎసికి పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బక్కి శ్రీను హంతకులను శిక్షించాలని ఆందోళన చేస్తూ పోరాటం చేస్తున్న జెఎసికి సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు. అదేవిధంగా బక్కి శ్రీను సంస్మరణ సభ సందర్భంగా శ్రీను కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు.