అస్తవ్యస్తంగా మారిన హన్మకొండ వెల్నెస్ కేంద్రం
#చెట్ల తీగలతో ముసురుకున్న ఆసుపత్రి
#పాములకు పక్షులకు నివాసంగా మారిన ఆసుపత్రి
#ఆసుపత్రికి రావాలంటే జంకుతున్న జనం
#పట్టించుకోని అధికారులు
హన్మకొండ జిల్లా, నేటిధాత్రి(మెడికల్):

హనుమకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన వెల్నెస్ కేంద్ర భవనం చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు పెరగడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం చెట్లతీగలతో ముసురుకుంది. అసలు ఇక్కడ వెల్నెస్ కేంద్రం ఉందా లేదా అనే భావన కలుగుతుంది. వెల్ నెస్ కేంద్రానికి రోజుకి కనీసం వందకు మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పత్రిక పాత్రికేయులు వస్తుంటారు అదేవిధంగా వెల్నెస్ కేంద్ర భవనం మొదటి అంతస్తుకి గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు టీకాలు తీసుకోవడానికి వస్తుంటారు,వెల్నెస్ సెంటర్ భవనానికి చుట్టుపక్కల పిచ్చి చెట్లు పెరిగి తీగలు పారి మొదటి అంతస్తులోకి విస్తరించడంతో వాటి నుండి పాములు కీటకాలు వచ్చే అవకాశం ఉండడంతో రోగులు మరియు సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్ కి రావాలి కానీ హాస్పిటల్ కి వస్తేనే సమస్య ఎదురయ్యేలా ఉంది ఇక్కడి పరిస్థితి ఇదిలా ఉంటే గర్భిణీలు ప్రసూతి కోసం చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల నుండి ఆసుపత్రి కి వస్తుంటారు, రోజుకు వందకు మందికి పైగా అవుట్ పేషెంట్స్ వస్తుంటారు వందకు మంది పైగా ఇన్ పేషెంట్స్ అడ్మిట్ అవుతారు, అందులో 30 నుండి 50 ప్రసవాలు జరుగుతాయి.ఆసుపత్రిలో డాక్టర్లు మరియు సిబ్బంది తక్కువగా ఉండడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్య ఆసుపత్రి అంటేనే రోగులు జంకుతున్నారు మెరుగైన వైద్యం అందడం లేదనీ రోగుల బంధువులు అంటున్నారు,ఆసుపత్రిలో బెడ్స్ కూడా తక్కువగా ఉన్నాయని దీనికి తోడు ఆసుపత్రి గోడల చుట్టూ పిచ్చి చెట్లు ఉండడంతో రోగులు భయభ్రాంతులకు గురవుతున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు అంటున్నారు.